Covid-19: హీరో విశాల్‌కు కరోనా
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
Vishal tested corona Positive: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో అటు కోలివుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్ ( Vishal ), ఆయన తండ్రి జీకే రెడ్డికి కరోనా సోకినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే దీనిపై హీరో విశాల్ దీనిపై క్లారిటీ ఇస్తూ ట్విట్ చేశారు.
‘‘ఆ వార్తలు నిజమే. పరీక్షల్లో మా నాన్నకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆయనకు సహాయం చేసే క్రమంలో నాకు కూడా కరోనా సోకింది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డా. అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్‌లో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకోని కేవలం వారం రోజుల్లోనే బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా’’ అంటూ విశాల్ ట్విట్ చేసి వెల్లడించారు. Also read: AR Rehman: నాపై కుట్ర చేస్తున్నారు
ఇదిలాఉంటే.. విశాల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా డిటెక్టివ్-2, చక్రా అనే సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. Kangana Ranaut on Sushant`s suicide: సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్