Hero Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు.. రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానంటూ..
Hero Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ సెన్సార్ అధికారులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మూవీ సెన్సార్ పనులు కోసం లంచం తీసుకున్నారంటూ నటుడు ఆరోపించారు.
Hero Vishal Shocking Comments: చాలా ఏళ్ల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 'మార్క్ ఆంటోని' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ముంబయి సెన్సార్ ఆఫీస్‌లో అవినీతి పెచ్చు మీరిపోయిందని అన్నారు. తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట్ కోసం) లంచంగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు విశాల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది సినీ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
‘''నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. మరో మార్గం లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా అవినీతి కూపంలోకి వెళ్లకూడదు. నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకూ రాకూడదని కోరుకుంటున్నా. చివరకు న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేల దృష్టికి తీసుకెళ్తాను'' అని విశాల్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను ఎవరెవరకి డబ్బులు పంపించానో వారి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా విశాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ‘'మార్క్ ఆంటోని’' చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్, ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ లో నటించారు. టైమ్ ట్రావెల్ అండ్ గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళంలో విడుదల కాగా.. హిందీలో గురువారం(సెప్టెంబరు 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Actor Siddharth: బెంగళూరులో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook