Heroine Shriya Saran husband Andrei Koscheev: టాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్‌ శ్రియా సరన్ భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ ఆసుపత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రియా భర్త ఆండ్రూ హెర్నియాతో బాధపడుతున్నాడట. రెండు నెలల క్రితం తన ముద్దుల తనయ రాధను కూడా ఎత్తుకునే స్థితిలో ఉన్నాడట. ఈ విషయాన్ని శ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొన్నారు. సర్జరీ సక్సెస్ చేసిన అపోలో హాస్పిటల్‌ హాస్పిటల్ యాజమాన్యానికి, ఉపాసనకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నా భర్తకు అద్బుతమైన చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు రెండు నెలల పాటు ఆండ్రీ కొశ్చీవ్‌.. మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయారు. ప్రస్తుతం ఆండ్రీ కోలుకున్నారు. ఇందుకు సాయం చేసిన అపోలో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియా సరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఆండ్రీ కొశ్చీవ్‌ చేతికి బ్యాండేజీ ఉన్న ఫొటోలను జత చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 


శ్రియా సరన్ పోస్ట్‌పై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించారు. అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆండ్రీ కొశ్చీవ్‌కు వచ్చిన హెర్నియా వ్యాధి ఏంటని అందరూ అనుకుంటున్నారు. హెర్నియా అనే వ్యాధి చాలా రకాలుగా ఉంటుందట. చిన్న పేగు, పెద్ద పేగులు దెబ్బతింటే.. ఒకరకమైన హెర్నియా అంటారట. ఏదేమైనా ఇప్పుడు ఆండ్రీ ఆరోగ్యంగా ఉండడంతో శ్రియా సంతోషంలో మునిగితేలుతున్నారు.



హీరోయిన్ శ్రియా సరన్, వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌లది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ.. 2018లో ఉదయ్‌పూర్‌ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. గతేడాది తనకు 9 నెలల కూతురు (రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు శ్రియా. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2' సినిమాలో నటిస్తున్నారు.


Also Read: Virat Kohli 100 Test: చాలామంది క్రికెటర్లు ఆ ఫీట్‌ అందుకోలేదు.. 100వ టెస్టులో విరాట్ కోహ్లీ ఆ రికార్డు అందుకుంటాడు: సన్నీ


Also Read: Joe Biden confuse: జో బైడెన్​ స్పీచ్​లో తడబాటు.. జోకులు వేస్తున్న నెటిజన్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook