Hi Nanna First Sigle: నేచురల్ స్టార్ నాని(Nani) నయా మూవీ 'హాయ్ నాన్న'(Hi Nanna). ఈ మూవీ ద్వారా శౌర్యువ్‌ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. మరో కీలకపాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. జెర్సీ తర్వాత నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా సూపర్ హిట్ తర్వాత నాని నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమయమా అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ అందరినీ అలరిస్తుంది. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా.. అనురాగ్ కలకర్ణి, సితార కృష్ణకుమార్ అలపించారు. హేషమ్‌ స్వరపరిచిన ఈ సాంగ్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఖుషికి బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అల్బమ్ అందించిన హేషమ్.. దీనికి కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 



ఫాదర్ డాటర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతున్న హాయ్ నాన్న మూవీని వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరు మేకర్స్. ఈ సినిమాకు పోటీగా చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. వెంకటేష్ పాన్‌ ఇండియా మూవీ సైంధవ్‌, షారుఖ్‌ డుంకీ, హాలీవుడ్ మూడి అక్వామ్యాన్‌-2.. నాని సినిమాకు పోటీగా రానున్నారు. మరి క్రిస్మస్ బరిలో హాయ్ నాన్న విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. 


Also Read: Mr Idiot: మిస్టర్ ఇడియట్ గా రాబోతున్న రవితేజ సోదరుడు కుమారుడు.. ఫస్ట్ లుక్ విడుదల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook