Mr Idiot: మిస్టర్ ఇడియట్ గా రాబోతున్న రవితేజ సోదరుడు కుమారుడు.. ఫస్ట్ లుక్ విడుదల..

Mr Idiot First Look: రవితేజ సోదరుడు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీకి మిస్ట‌ర్ ఇడియ‌ట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 01:40 PM IST
Mr Idiot: మిస్టర్ ఇడియట్ గా రాబోతున్న రవితేజ సోదరుడు కుమారుడు.. ఫస్ట్ లుక్ విడుదల..

Mr Idiot First Look Released:  మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ గతంలో రవితేజ నటించిన ఇడియట్  మూవీ టైటిల్ ను తాజాగా తన సినిమాకు పెట్టుకున్నాడు. ఈ మూవీకి 'మిస్ట‌ర్ ఇడియ‌ట్' (Mister Idiot) అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు మేకర్స్. గౌరి రొణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

సెప్టెంబరు 08(శుక్రవారం)న మాధవ్ పుట్టినరోజు. అతడి బర్త్ డే సందర్భంగా మిస్టర్ ఇడియట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు విడుదల చేశారు.  ఈ మూవీకి అనూర్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నవంబరులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత జేజేఆర్ రవిచంద్ తెలిపారు. 

ఈ మూవీ కంటే ముందు ఏయ్ పిల్లా అనే సినిమాకు మాధవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ ర‌మేష్ శ‌ర్మ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. దీంతోనే మాధవ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. దీంతో మాధవ్ తొలి సినిమాగా మిస్టర్ ఇడియట్ రానుంది. గౌరి రోణంకి గతంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన పెళ్లి సంద‌డి సినిమాకు గౌరి రోణంకి డైరెక్షన్ చేశారు. 

Also Read: Game Changer Songs: రామ్‌చరణ్‌ '‘గేమ్‌ఛేంజర్'’నుంచి సాంగ్ లీక్ .. ఆందోళనలో మూవీటీమ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News