High court Shock to Sai Pallavi: విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమెకు మరో షాక్ తగిలింది. విరాటపర్వం సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కాశ్మీరీ పండితులను చంపిన వారు అలాగే ఇప్పుడు గో సంరక్షకులు పేరుతో ముస్లిం డ్రైవర్లను చితకబాదుతున్న వారు ఒకటే అంటూ కామెంట్ చేసింది. దీంతో హిందూ సంస్థల వారు సాయి పల్లవి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక సినిమా బ్యాన్ చేయాలని కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె వ్యాఖ్యలు సరికాదు అంటూ బజరంగ్ దళ్,  విశ్వహిందూ పరిషత్ కు సంబంధించిన కొంతమంది సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయకుండా సాయి పల్లవిని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు జారీ చేయడం కరెక్ట్ కాదని తాను కామెంట్ చేయలేదు కాబట్టి ఆ నోటీసులు కొట్టివేయాలని సాయి పల్లవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు వినింది. సాయి పల్లవి తరపున న్యాయవాది వాదిస్తూ సాయి పల్లవి మానవత్వంతో ఉండాలని మాత్రమే చెప్పారని కాశ్మీరీ పండిట్లను చంపిన వారు గోరక్షకులు ఒక్కటే అని ఆమె అనలేదని పేర్కొన్నారు. 


పోలీసులు సాయి పల్ల మీద ఇంకా కేసు నమోదు చేయలేదని కేవలం ఆమె ఏం మాట్లాడారనే విషయం మీద వాస్తవాలు ధృవీకరించుకోవడం కోసమే సుల్తాన్ బజార్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారనే విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం వేసిన పిటిషన్ను కొట్టివేశారు. పోలీసుల నోటీసులు తీసుకుని వారికి సరైన సమాధానం ఇవ్వాలంటూ ధర్మాసనం సూచించింది. ఇక రానా,  సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుండగా ఆమె నటించిన మరో చిత్రం గార్గి విడుదలకు సిద్దమవుతోంది. తమిళం,  తెలుగు,  మలయాళం భాషల్లో ఈ సినిమా జూలై 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు నిర్మాతలు.


Also Read: James Caan Death: హాలీవుడ్‌లో విషాదం.. గాడ్ ఫాదర్ స్టార్ జేమ్స్ కాన్ కన్నుమూత..


Also Read: Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా సాహసం.. ఎత్తైన బిల్డింగ్‌పై అన్ని కనబడేలా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook