Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ ఎంతమందిని ఆపదలోంచి కాపాడినా.. రియల్ లైఫ్ లో వాళ్లు బయటికొస్తే మాత్రం అభిమానుల బారి నుంచి వాళ్లను వాళ్లు కాపాడుకోలేరు. అందుకే ఎంత స్టార్ హీరో అయితే, ఎంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్లకు అంత ఎక్కువ స్ట్రాంగ్ బాడీగార్డ్స్ అవసరం ఉంటుంది. నిజానికి సెలబ్రిటీలకు రక్షణ అందివ్వడం బాడీగార్డ్స్ కి కత్తి మీద సాములాంటిదే. అందుకే వాళ్లకు రక్షణ అందించే బాడీగార్డులు కూడా అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా బాలీవుడ్ లో కొంతమంది స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా రక్షణ అందిస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు జనం మధ్యలోకి వస్తే వారికి సెక్యురిటీ కల్పించడం ఎంత కష్టమో వారికి సెక్యురిటీ అందించే వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్‌కి సెక్యురిటీ కల్పించడం మరింత కష్టం అనే సంగతి తెలిసిందే. అందుకే ఆ స్టార్ సెలబ్రిటీలకు రక్షణ అందించే బాడీగార్డులు కూడా అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.


అందరికంటే ముందుగా బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జితేంద్ర షిండే గురించి తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం చాలా కాలంగా అమితాబ్ బచ్చన్‌కి బాడీగార్డుగా డ్యూటీ చేస్తోన్న జితేంద్ర షిండే ఏడాదికి రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు. 


బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డులలో షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ అందరికంటే ముందుంటాడు. రవి సింగ్ కి షారుఖ్ ఖాన్ ఏడాదికి సుమారు రూ. 2.7 కోట్లు చెల్లిస్తున్నాడు.


సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా అతడికి కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడి టైప్ కూడా. షేరాకు సల్మాన్ ఖాన్ సంవత్సరానికి రూ. 2 కోట్లు వేతనం చెల్లిస్తున్నాడు. 2011లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాడీగార్డ్ సినిమాలో టైటిల్ ట్రాక్‌లోనూ షేరా కనిపించడం చూసే ఉంటారు.


స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తన బాడీగార్డు జలాల్‌కు 1.2 కోట్ల రెమ్యునరేషన్ చెల్లిస్తోంది. జలాల్ చాలా ఏళ్లుగా ఆమె వద్ద బాడీగార్డుగా పనిచేస్తున్నాడు.


అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ వార్షిక వేతనం రూ. 2 కోట్లు. అలాగే అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ కి రూ. 1.2 కోట్లు వేతనం అందిస్తున్నాడు. సినిమా హీరోలు ఎలాంటి షెడ్యూల్ లేకుండా ఖాళీగా ఉండి, అదే సమయంలో వాళ్ల కుటుంబసభ్యులు బయటికి వెళ్లినట్టయితే.. ఆ సమయంలో వారికి బాడీగార్డులే ఎస్కార్టుగా వెళ్తుంటారు.


లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులకు ప్రకాశ్ సింగ్ సోను బాడీగార్డుగా సేవలు అందిస్తున్నాడు. ప్రకాష్ సింగ్ చాలా కాలంగా అనుష్క శర్మకు బాడీగార్డుగా ఉన్నాడు. అయితే, అనుష్కా శర్మ పెళ్లికి ముందు ఆమెకు మాత్రమే పర్సనల్ బాడీగార్డ్ అయిన ప్రకాశ్ సింగ్.. ఆ తర్వాతి నుంచి సమయం, సందర్భాన్నిబట్టి ఇద్దరికీ రక్షణ అందిస్తున్నాడు. జూమ్ టీవీ వార్తా కథనం ప్రకారం అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు ( Virat Kohli, Anushka Sharma ) తమ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్‌కి ఏడాదికి రూ.1.2 కోట్లు రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు.


Also Read : RRR Oscar Awards : ఆస్కార్ అవార్డు ఇవ్వడం లేదా? కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారా?.. రాజమౌళి మామూలోడు కాదు 


Also Read : Actress Madhubala New Movie : ఓటీటీలో డెజావు సందడి.. సత్తా చాటిన నాటి హీరోయిన్ మధుభాల


Also Read : Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook