Pushpa Part 2: అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సీక్వెల్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 మరింత రసవత్తరంగా ఉండేలా లెక్కల మాస్టారి గణాంకాల్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనమైంది. సెలెబ్రిటీలు, సామాన్యులు అందరికీ పుష్ప మేనియా ఊపేసింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు దేశం మొత్తం ఫిదా అయింది. లెక్కల మాస్టారి గణాంకాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పుష్ప రెండవ భాగం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రారంభమైంది. భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ విజయం తరువాత లెక్కల మాస్టారి ఆలోచన కూడా మారినట్టు తెలుస్తోంది. 


జూన్ 10 నుంచి అంటే ఇవాళ్టి నుంచి పుష్ప రెండవ భాగం ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. సీక్వెల్ అయినందున మొదటి భాగంలో ఉన్న నటీనటుల్లో చాలామంది రెండవభాగంలో ఉంటారని ఆశించారు. కానీ రెండవ భాగం కాస్త విభిన్నంగా, కట్టుదిట్టంగా ఉండాలని భావిస్తున్న నేపధ్యంలో కొత్తవారిని తీసుకునేందుకు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు. మొదటి భాగం సక్సెస్ కావడంతో రెండవ భాగంపై ఆసక్తి పెరిగింది. ఎలా ఉంటుంది, విలన్ ఫహద్ ఫాజిల్‌ను అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తి కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు బలంగా ఉండేందుకు కధనంలో మార్పులు చేర్పులు చేశాడట సుకుమార్. అందుకే ఇప్పుడు కొత్తనటుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. 


Also read: Kannada Actor Ramya: కన్నడ నటి రమ్యకు వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook