Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్
బాలీవుడ్ గ్రీకు సుందరుడు హృతిక్ రోషన్ సుమారు ఎనిమిది నెలల క్రితం అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీతో హాలీవుడ్ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రంలో గూఢచారి పాత్రలో కనిపించన్నాడట హృతిక్ ( Hrithik Roshan ).
బాలీవుడ్ గ్రీకు సుందరుడు హృతిక్ రోషన్ సుమారు ఎనిమిది నెలల క్రితం అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీతో హాలీవుడ్ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రంలో గూఢచారి పాత్రలో కనిపించన్నాడట హృతిక్ ( Hrithik Roshan ). ఈ మూవీని ఒక పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయనుందట. ఈ మూవీలో రోల్ కోసం హృతిక్ ఆడిషన్ కూడా ఇచ్చాడు అని సమాచారం. త్వరలో హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ?
హాలివుడ్ ( Hollywood ) లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉంటారు అని.. అందులో హృతిక్ ఒకరు అని సమాచారం. అయితే దీనిపై ఇప్పటవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే రోల్ కోసం హృతిక్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితుల వల్ల అమెరికాకు వెళ్లి ఆడిషన్ ఇవ్వడం సాధ్యం కాలేదట. అందుకే హృతిక్ తన ఇంట్లోనే ఆడిషన్ రికార్డు చేసి అమెరికాకు పంపించాడట. లాస్ ఏంజెలస్ లోని టీమ్ ...హృతిక్ టీమ్ ను సంప్రదించి వారికి మూవీలోని రోల్ గురించి తెలిపి, సీన్ నారేట్ చేసిందట. రెండు వారాల క్రితమే హృతిక్ ఆడిషన్ పూర్తి చేశాడట. ప్రస్తుతం క్రిష్ 4 చిత్రంతో బిజీగా ఉన్న హృతిక్ ఆ మూవీ పూర్తయ్యాక అప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉంది అని సమాచారం. అయితే మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
Also Read | జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR