Hrithik Roshan’s ex-wife Sussanne Khan Makes Her Relationship Official With Arslan Goni : బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ గత కొన్ని రోజులుగా మరొకరితో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.నటుడు అర్స్లాన్ గోనితో సుసానే ఖాన్‌ (Sussanne Khan) ప్రేమాయాణం కొనసాగిస్తుందంటా. బాలీవుడ్‌లో ఇప్పుడిదే గుసగుస.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సుసానే ఖాన్‌, అర్స్లాన్ గోని (Arslan Goni) స్పందించలేదు. కానీ వారిద్దరూ మాత్రం చాలా సన్నిహితంగా ఉండడంతో రూమార్స్‌కు బలం చేకూరింది. అంతేకాదు రూమర్లను కూడా వారూ ఎప్పుడూ తిప్పి కొట్టలేదు. దీంతో వీరి ఎఫైర్‌‌ను కన్ఫమ్ చేసేసింది సోషల్ మీడియా (Social media). సుసానే కొత్త బాయ్‌ఫ్రెండ్‌ (New boyfriend) అర్స్లాన్ గోని అంటూ నెటిజెన్స్ అంటున్నారు. 


ఇక అర్స్లాన్ గోనితో ((Arslan Goni) సుసానే ఖాన్‌ రిలేషన్‌లో ఉంది అనడానికి సుసానే సోషల్‌ మీడియా పోస్ట్‌లు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా అర్స్లాన్ గోని బర్త్‌డే (Birthday) సందర్భంగా సుసానే అతనితో ఎంతో క్లోజ్‌గా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


Also Read : Greater Noida: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిపోయిన యువతి... అసలేం జరిగింది...


అర్స్లాన్ గోనికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఈ ఫోటో పోస్ట్‌ చేసింది సుసానే ఖాన్‌. హ్యాపీ బర్త్ డే చెప్తూ.. తన లైఫ్‌లో ఇప్పటి వరకు తాను చూసిన ఒక అందమైన శక్తి అర్స్లాన్ గోని అంటూ పేర్కొంది సుసానే ఖాన్‌. ఇక గోనీ ఈ పోస్ట్‌పై లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. 




 


ఇక నెటిజెన్స్ ఈ పోస్ట్‌పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ జంటకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరేమో వారిని విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారు. గతంలో అక్టోబర్‌లో సుసానే బర్త్‌డే (Susanne Birthday) సందర్భంగా కూడా గోనీ.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ (Happy Birthday Darling) అంటూ అర్స్లాన్ గోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


Also Read : Video: సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ హంగామా.. కేక పుట్టించారుగా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook