Girl fell from apartment in naked condition: గ్రేటర్ నోయిడాలోని (Greater Noida) ఎన్నారై సొసైటీ అపార్ట్మెంట్లోని ఏడో అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయమవడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆ యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డిసెంబర్ 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి నగ్నంగా కిందపడిపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) పానీపట్కి చెందిన యువతి (24) ఈ నెల 12న నోయిడాలోని పారీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఎన్నారై సొసైటీకి వచ్చింది. ఆ అపార్ట్మెంట్లోని ఏడో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో ఆమె స్నేహితుడు నివాసం ఉంటున్నాడు. ఆ రాత్రికి అతని ఫ్లాట్‌లోనే ఉన్న యువతి... అదే రాత్రి ఆ ఫ్లాట్ నుంచి కిందపడిపోయింది. ఆ సమయంలో ఆమె పూర్తి వివస్త్రగా ఉంది.
ఏడో అంతస్తు నుంచి కిందపడటంతో యువతి తలకు బలమైన గాయమైంది. ఘటనపై పోలీసులకు (Delhi Police) సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి కోమాలో ఉందని పోలీసులు తెలిపారు. యువతి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని.. కానీ ఇంతవరకూ ఎవరూ ఆసుపత్రికి రాలేదని వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... ఆ యువతి, యువకుడు ఇద్దరు కలిసి రాత్రి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో యువతి మద్యం సేవించినట్లు చెప్పారు. గాఢ నిద్రలో వాష్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె కిటికీ నుంచి కిందపడి ఉంటుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆమె స్నేహితుడు ఆమెపై అఘాయిత్యానికి (Crime against Women) ఒడిగట్టే ప్రయత్నం చేశాడా... ఆ క్రమంలోనే ఆమె కిందపడిపోయిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. పోలీసులు ఆమె స్నేహితుడిని విచారించగా... ఆమె ఎప్పుడూ నోయిడా వచ్చినా తన ఫ్లాట్‌కు వస్తుందని, ఇద్దరం తరచూ కలుస్తుంటామని చెప్పాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Video: సింగిల్ పీస్ డ్రెస్‌లో గర్ల్స్ బ్యాచిలర్ పార్టీ హంగామా.. మందు,చిందులతో రచ్చ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook