Hyper Aadi : ఇంద్రజ పరువుగోవిందా.. హైపర్ ఆది మాటలకు కాలినట్టుందే?
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది అందరినీ ఎలా ఆడుకుంటాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఢీ ఇలా అన్ని షోలను వదిలేసుకుని తన ఫోకస్ అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంద్రజను ఆది ఆడేసుకున్నాడు.
Sridevi Drama Company Promo బుల్లితెరపై హైపర్ ఆది పంచ్‌లకు ఫుల్ క్రేజ్, డిమాండ్ ఉంటుంది. ఆది అందరి మీదా పంచులు వేస్తుంటాడు. అయితే ఆది ఈ మధ్య సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. సినిమా ఆఫర్లు ఎక్కువ అవ్వడంతో బుల్లితెరకు ఎక్కువగా టైం కేటాయించలేకపోతోన్నాడు. అందుకే ఢీ, జబర్దస్త్ వంటి షోలను వదిలేసుకున్నాడు. వెండితెరపై ఆదికి బాగానే ఆఫర్లు వస్తున్నా కూడా.. అవి అంతగా గుర్తింపును ఇవ్వలేకపోతోన్నాయి.
ధమాకా, దాస్ కా ధమ్కీ, సార్ ఇలా ప్రతీ సినిమాల్లో ఆది కనిపించాడు. తన స్టైల్లో నాలుగు పంచ్‌లు వేస్తున్నాడు. నవ్విస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆది పంచ్‌లను ఎంజాయ్ చేసినంతగా వాటిని ఎంజాయ్ చేయలేకపోతోన్నారు. అలా ఆది పంచ్‌లను బుల్లితెరపై మిస్ అయ్యే వారికి శ్రీదేవీ డ్రామా కంపెనీ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఇంద్రజ మీద వరుసగా పంచ్‌లు వేశాడు. ఆడవాళ్లంతా ఒక వైపు ఉంటే.. ఆది మరో సైడ్ నిల్చుని తాడు ఆట ఆడారు. ఇంద్రజను కూడా రమ్మని పిలిచాడు. నన్ను గెలిచిన వాడు చెన్నైలో ఉన్నాడు.. నాకు చాలు అని ఇంద్రజ దండం పెట్టేస్తుంది.
Also Read: Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి
ఇక ఆది గెలిచిన తరువాత ఇంద్రజకు పంచ్ వేస్తాడు. మీరెళ్లి చెన్నైలో గెలవండి అని కౌంటర్ వేస్తాడు. ఆ తరువాత ఇంద్రజ ఓ డైలాగ్ కొడుతుంది. ఆ డైలాగ్‌ను సైతం ఆది కించపరిచేశాడు. ఆవిడ డైలాగ్ ఎలా చెప్పిందో తెలుసా.. అంటూ వంటల ప్రోగ్రాంలో యాంకరింగ్ చేసేదానిలా చెప్పిందంటూ పరువుతీశాడు. దీంతో ఇంద్రజ మొహం మాడిపోయినట్టుగా కనిపించింది. ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఆది మాత్రం పంచ్‌లు వేయడం వెనక్కి తగ్గడన్న సంగతి తెలిసిందే.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook