Rajamouli Pawan Kalyan Movie: పవన్ కల్యాణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
Rajamouli Pawan Kalyan Movie: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పని చేయాలని ప్రతి హీరో కోరుకోవడం మామూలే! కానీ, రాజమౌళి మాత్రం ఓ హీరోతో సినిమా చేసేందుకు ఎదురుచూశారని మీకు తెలుసా?.. అవును, మీరు విన్నది నిజమే! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు ఎన్నో రోజులు వేచి చూశానని చెప్పుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఇంతకీ ఆ సంగతి ఏంటంటే..?
Rajamouli Pawan Kalyan Movie: దర్శకుడు రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా ఎందుకు రాలేదు? ఎలాంటి ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
తాజాగా శ్రీకాకుళంలోని ఒక కాలేజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన రాజమౌళి అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే ఓ మెగా అభిమాని పవన్ కల్యాణ్ తో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని అడిగేశాడు. అతని ప్రశ్నకు స్పందించిన రాజమౌళి.. “పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. ఓసారి ఓ మూవీ షూటింగ్ లో ఆయనను కలిసి మాట్లాడగా చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఆ సమయంలో మీతో సినిమా చేయాలని ఉంది ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు చెప్పండి అని అడిగాను. ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పారు. నేను కూడా కథ రెడీ చేసుకుని ఆయనకు చెప్పాలనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎలాంటి కబురూ రాలేదు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా.. నేను కూడా మోర్ బిగ్గర్, వైడర్ సినిమాలు చేయాలనే ఆలోచనతో ‘మగధీర’, ‘యమదొంగ’ వంటి సినిమాలు చేశాను. మా ఇద్దరి థింకింగ్ మారిపోయింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైంది. నేనేమో ఇటువైపు ఎక్కువ రోజులు సినిమాలకు కేటాయించాను. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్.. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్.. కాకపోతే మేము ఇద్దరం రెండు వేరు వేరు మార్గాలలో ప్రయాణిస్తున్నాము. మా ఇద్దరివి విభిన్న దారులు” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా పాజిటివ్
Also Read: Balakrishna Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలకృష్ణ సందడి..ప్రోమో మామూలుగా లేదుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి