Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌కు (Urmila Matondkar Corona) కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్ క్వారంటైన్ లో సమయం గడుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఊర్మిళ (Urmila Matondkar News) స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు కరోనా పరీక్ష చేయించుకోమని సూచించారు.
I've tested positive for #COVID19
I'm fine n have isolated myself in home quarantine. Requesting everyone who came in contact with me to get tested immediately.
Also humbly request all you lovely people to take care of yourselves during the Diwali festivities 🙏😇— Urmila Matondkar (@UrmilaMatondkar) October 31, 2021
“నాకు చేసిన కరోనా పరీక్షలో పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. హోమ్ క్వారంటైన్ లో సమయం గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా నాతో దగ్గరగా ఉన్న వారంతా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. దీపావళి పండగ నేపథ్యంలో మీ ఆరోగ్యంపై మీరు జాగ్రత్త వహించాలి” అని ఊర్మిళా మటోంద్కర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ ట్వీట్ పై స్పందించిన అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా ఎలా సోకుతుంది అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drugs Case) అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఊర్మిళ మద్దతుగా (Urmila Matondkar Aryan Khan) నిలిచారు. అలాంటి క్లిష సమయంలోనూ షారుక్ ఖాన్ తనలోని గౌరవం, దయ, పరిపక్వతను కోల్పోలేదని ఆమె కొనియాడారు. షారుక్ ను చూస్తుంటే తానెంతో గర్వ పడుతున్నట్లు ఊర్మిళ మటోంద్కర్ తెలిపారు.
Also Read: Annayyaa Annayyaa lyrical song: పెద్దన్న మూవీ నుంచి అదుర్స్ అనిపించేలా అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook