iBOMMA Services Shut Down Permanently in India form September 9th: ఐబొమ్మ.. ఈ పేరు గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. థియేటర్‌లో భారీగా డబ్బులు పెట్టి సినిమా చూడని మధ్యతరగతి వారికి ఇది మంచి ఓటీటీ వేదిక. ఒకప్పుడు సినిమా కోసం థియేటర్లకు వెళ్లే సినీ అభిమానులు.. ఐబొమ్మ పుణ్యమాని ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నా.. సబ్‌స్క్రిప్షన్ బాదుడు తట్టుకోలేక ప్రతిఒకరు హెచ్‌డీ ఫార్మాట్‌లో సినిమాలను అందజేసే ఐబొమ్మ వైపే చూస్తున్నారు. అందుకే ఐబొమ్మ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. అయితే తాజాగా ఐబొమ్మ బిగ్‌ షాక్ ఇచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో సినీ ప్రియులకు వరుస షాక్‌లు ఇస్తున్న ఐబొమ్మ.. తాజాగా బిగ్ షాకిచ్చింది. ఇప్పటికే సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవాడనికి వీలు లేదని స్పష్టం చెప్పిన ఐబొమ్మ.. ఇప్పుడు తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఇండియాలో తమ ఆపరేషన్లను పూర్తిగా మూసివేస్తున్నట్లుగా తేల్చి చెప్పింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి తమ సేవలను తెచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్‌ చేయొద్దని కోరింది. 


'హయ్.. ఐబొమ్మ యూసర్లకు మేము షాక్ కానీ సప్రైజ్ కానీ ఇవ్వాలనుకోవట్లేదు. చర్యలు తీసుకునే ముందు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఐబొమ్మ సేవలను శాశ్వతంగా మూసివేస్తున్నాం. మేము ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాము. ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌ 9నుంచి ఇండియాలో ఐబొమ్మ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నాం. భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదు. యూజర్స్‌ ఎవరు మెయిల్స్‌ చేయవద్దు. ఇంతకాలం మాపై చూపించిన ప్రేమకు అభినందలు' అని ఐబొమ్మ  తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 


[[{"fid":"244180","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రస్తుతం ఐబొమ్మను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా యూజర్ల డేటాను అమ్ముతున్నారని ఐబొమ్మపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సినీ పెద్దల నుంచి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. దాంతో గత కొద్ది రోజులుగా ఐబొమ్మ సినీ ప్రియులకు వరుసగా షాకులిస్తుంది. గతంలో తమ సేవలను పూర్తిగా నిలివేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 9 నుంచి తమ సేవలను పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఐబొమ్మ తీసుకున్న ఈ నిర్ణయం సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.


Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook