Indian 2 Movie: బాక్స్‌ఆఫీస్ బంపర్ హిట్ మూవీ భారతీయుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. పలు వివాదాలతో ఆగిపోయిన సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కుతోంది. ఇప్పుడీ సినిమాకు హీరోయిన్ ఎవరనేది చర్చనీయాంశమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు , తమిళ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలంటే విన్పించే దర్శకుడి పేరు శంకర్. భారతీయుడు 2 సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వివిద రకాల వివాదాలతో సినిమా నిలిచిపోయింది. ఇప్పుడు వివాదాలన్నీ సమసిపోయి తిరిగి ట్రాక్ ఎక్కుతోంది. కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో కొద్దికాలం షూటింగ్ నిల్చిపోయింది. 


ఇప్పుడీ సినిమాకు హీరోయన్ సమస్య ఎదురైంది. ఇండియన్ 2 చిత్రం నుంచి కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తప్పుకోవడంతో..ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇండియన్ 2 హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను(Tamannah Bhatia) తీసుకునేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అటు తమన్నా సైతం అంగీకారం తెలిపినట్టు సమాచారం. ప్రెగ్నెంట్ కావడంతో కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.కాజల్ తరువాత త్రిషను పేరు పరిశీలనలో వచ్చినా...ఆ తరువాత తమన్నావైపుకే చిత్ర యూనిట్ మొగ్గు చూపింది. భారతీయుడు ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడా కధ కోణంలోనే ఇండియన్ 2(Indian 2) తెరకెక్కబోతోంది. కధ, స్క్రీన్‌ప్లే పరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు శంకర్. తమన్నా హీరోయిన్ అంశాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 


Also read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్ కోసం తగ్గెదేలే అంటున్న Allu Arjun fans


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook