100 Crore Movies: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దక్షిణాది సినిమాలు దేశాన్ని ఓ ఊపు ఊపుతున్నాయి. విడుదలైన సినిమా..వంద కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఎంతో సమయం పట్టడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాల్లో వంద కోట్ల క్లబ్ చేరిన టాప్ 15 సినిమాలేంటో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల పరంపర కొనసాగుతోంది. భారీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. గతంలో వంద కోట్లకు చేరుకోవాలంటే కనీసం 10-30 రోజులు పట్టేది. ఇప్పుడు ఒకరోజులోనే లేదా రెండ్రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌కు చేరుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు వందకోట్లు చేరేందుకు ఒకరోజు కంటే ఎక్కువ సమయం పట్టం లేదు. 


బాహుబలి పార్ట్ 2 సినిమా కేవలం ఒకరోజులోనే వంద కోట్లు వసూలు చేసింది. రెండవది ప్రభాస్ నటించిన సాహో. ఉత్తరాదిన భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 24 గంటల్లోపే వంద కోట్ల క్లబ్‌కు చేరుకుంది. ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాకు వంద కోట్లు వసూలయ్యేందుకు మూడురోజులు పట్టింది. అటు అమీర్ ఖాన్ సినిమా దంగల్ కూడా మూడ్రోజుల్లో వంద కోట్లు వసూలు చేసింది. సంజయ్ దత్‌పై తీసిన సినిమా సంజూ వందకోట్లు చేరేందుకు మూడ్రోజులు పట్టింది. 


ఇక బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయ్‌జాన్ సినిమా వందకోట్లు చేరేందుకు మూడ్రోజులు పట్టింది. హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా మూడ్రోజుల్లో వందకోట్లు వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ మూడ్రోజుల్లోనే వందకోట్లకు చేరింది. గ్రహాంతరవాసి నేపధ్యపు సినిమా, అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా నాలుగు రోజుల్లో వందకోట్లకు చేరింది. దీపికా పదుకోన్ నటించిన పద్మావతి సినిమా నాలుగురోజుల్లో వందకోట్లు వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ఐదురోజుల్లో వందకోట్లకు చేరింది. 


ఇకఅమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించిన ధూమ్ 3 సినిమాకు వందకోట్ల క్లబ్‌కు చేరేందుకు ఆరు రోజులు పట్టింది. తెలుగులో హిట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ హిందీలో కబీర్ సింగ్ వంద కోట్ల క్లబ్ చేరేందుకు ఆరు రోజులు పట్టింది. అజయ్ దేవగణ్ నటించిన తానాజీ సినిమా ఆరు రోజుల్లో వందకోట్లు వసూలు చేసింది. ఇక అల్లు అర్జున్ సినిమా పుష్ప వందకోట్లు చేరేందుకు 7 రోజులు పట్టింది. 


Also read: Kiara Advani Pics: తెల్ల చీరలో.. మల్లెపువ్వులా మెరిసిపోతున్న కియారా అద్వానీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook