Anchor Sowmya Humiliated Indraja బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలు వేసే టీఆర్పీ స్టంట్లు అందరికీ తెలిసిందే. ఈ షోలకు సంబంధించిన ప్రోమోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే వాటిలో టీఆర్పీ కోసం క్రియేట్ చేసిన సీన్లే ఎక్కువగా ఉంటాయి. అవి టీఆర్పీ స్టంట్లేనని జనాలు తెలిసినా కూడా వాటినే ఫాలో అవుతుంటారు. ఎపిసోడ్‌ల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ఇలా ప్రోమోను కట్ చేస్తారని ఆడియెన్స్‌ను ఎలాగూ ముందే పసిగట్టేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంద్రజ, సౌమ్యలు కాస్త ఓవర్ డ్రామా చేసినట్టుగా ఉంది. వారిద్దరి యాక్షన్ చూస్తుంటే ఇది కచ్చితంగా టీఆర్పీ స్టంట్ అని అర్థం అవుతోంది. ఇంద్రజ తనకేదో అవమానం జరిగినట్టుగా బిల్డప్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం. ఈ ప్రోమోలో శ్రీరామనవమి స్పెషల్ అంటూ డిజైన్ చేశారు.


అయితే శ్రీరామనవమి అంటే పానకం స్పెషల్ అని అందరికీ తెలిసిందే. రాఘవ టీం, తాగుబోతు రమేష్‌ వెంకీ టీం పానకం రెడీ చేసింది. వాటిలో ఏది బాగుందో చెప్పమని ఇంద్రజను కోరారు. ఇంద్రజ టేస్ట్ చూసి రాఘవ టీం చేసింది బాగుందని చెప్పింది. కానీ సౌమ్య తాగుబోతు రమేష్‌ వెంకీ టీం చేసింది బాగుందని, ఓ సారి టేస్ట్ చేయమని అడిగింది. అయినా కూడా రాఘవ గారు చేసింది బాగుందని ఇంద్రజ చెప్పింది.


ఆ తరువాత కూడా సౌమ్య.. ఇంకా మిగతా వారిని కూడా జడ్జ్మెంట్ అడిగింది. కృష్ణ భగవాన్ గారిని టేస్ట్ చేయమని కోరింది. దీంతో ఇంద్రజకు కాలిపోయింది. ఇంత మంది ఒపీనియన్ తీసుకునేట్టు అయితే నన్ను ఎందుకు అడిగారు.. ఇది కరెక్ట్ కాదంటూ ఇంద్రజ హర్ట్ అయింది. దీంతో రాఘవ స్టేజ్ మీద నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. ఇదంతా నిజంగానే జరిగింది. లేదంటే ప్రోమో కోసం, టీఆర్పీ కోసమే చేశారా? అన్నది చూడాలి.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook