Interesting Facts About Chhello Show the Indias Official Entry To Oscars 2023: ప్రతి సినిమా నటుడు అలాగే ప్రతి టెక్నీషియన్ కల ఆస్కార్ అవార్డులు సాధించడం. ఆస్కార్ అవార్డు సాధించడం సంగతి పక్కన పెడితే, అసలు ఆ అవార్డులకు నామినేట్ అవ్వడమే పెద్ద గౌరవంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది భారత్ నుంచి పలు సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. మన తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు నార్త్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాశ్మీరీ ఫైల్స్ కూడా నామినేట్ అయ్యే అవకాశం ఉందని భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ను అమిత్ షా కలవడం అలాగే కాశ్మీర్ ఫైల్స్ ని బిజెపికి చెందిన చాలామంది ప్రమోట్ చేయడంతో ఈ రెండు సినిమాల నుంచి ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తాయని భావించారు. అయితే అనూహ్యంగా ఒక గుజరాతి మూవీ చెల్లో షో అనే దాన్ని భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్స్ కి పంపుతున్నారు. ఈ చెల్లో షోని ది లాస్ట్ ఫిలిం షో అని కూడా పిలుస్తున్నారు.  ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో ఈ మూవీని పంపిస్తున్నారు.


సిద్ధార్థ రాయి కపూర్ నిర్మించిన ఈ సినిమాను పాన్ నలిన్ డైరెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి అనేక అవార్డులు కూడా సంపాదించింది. చెల్లో షో అనే సినిమా పూర్తిగా సినిమాలను ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఒకప్పటి సినిమాకు పట్టం కడుతూ ఈ సినిమాను ఒక ట్రిబ్యూట్ లాగా రూపొందించారు. ఆటో బయోగ్రాఫికల్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ సినిమా దశాబ్దాలుగా ఎలా పరిణితి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు.


సెల్యులాయిడ్ నుంచి డిజిటల్ కి మారడం ఆ తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసి కల్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ గా మార్చడం వంటి వాటిని ఈ సినిమాలో చూపించారు. సినిమాపై ఎంతో ప్రేమతో సినిమా ప్రేమికులందరినీ కంటతడి పెట్టించే విధంగా రూపొందించిన ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అవడం గొప్ప విషయమే అని అంటున్నారు. మరి. ఈ సినిమాలోభవిన్‌ రబారీ, వికాస్‌ బాటా, రిచా మీనా, భవేష్‌ శ్రీమాలి, దీపేన్‌ రావల్‌, రాహుల్‌ కోలీ వంటి గుజరాతి నటినటులు నటించారు.


ఈ సినిమాని మొదటి సారిగా ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలో విడుదల కాలేదు. అక్టోబర్ 14వ తేదీన గుజరాత్ సహాయం భారతదేశ వ్యాప్తంగా పలు థియేటర్లలో గుజరాతి వెర్షన్ విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఆస్కార్సుకు నామినేట్ అయిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి.


Also Read: RRR for Oscars: ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ కు నామినేట్ అయ్యేందుకు మరో ఛాన్స్.. రంగంలోకి టీం.. కష్టం కాదు కానీ?


Also Read: OSCAR Awards: ఆస్కార్‌కు ఇండియా నుంచి లాస్ట్ ఫిల్మ్ షో, ఆర్ఆర్ఆర్ ఎందుకు నామినేట్ కాలేదో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.