Kalki 2898AD: కమల్ హాసన్ పాత్ర గురించి కీలక అప్డేట్.. రన్ టైమ్ తెలిస్తే షాక్ !
Kalki Update: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర రన్ టైమ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kamal Haasan in Kalki 2898AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898ఏడి అతి త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచం మొత్తం మీద ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.
హీరో హీరోయిన్ల సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో దాదాపు స్టార్ నటీనటులు అందరూ కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు. దిశా పటాని కూడా కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో.. లోకనాయకుడు కమలహాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కమల్ హసన్ పాత్రకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ ఈ సినిమాలో తనది ఒక క్యామియో పాత్ర అని చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కల్కి మొదటి భాగంలో కమల్ హాసన్ కనిపించేది కేవలం 20 నిమిషాలేనట. ఈ నేపథ్యంలో కల్కి రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్ర నిడివి కనీసం 90 నిమిషాల వరకు ఉంటుంది అని కూడా ఒక వార్త వినిపిస్తోంది.
కల్కి మొదటి భాగం విషయానికి వస్తే కమల్ హాసన్ కొన్ని సన్నివేశాలు మాత్రమే కనిపిస్తారని, ప్రభాస్ కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండవని అనుకోవచ్చు. కల్కి రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో కేవలం ఆయన పాత్ర ఇంట్రడక్షన్ మాత్రమే ఉండొచ్చు.
ఇప్పటిదాకా ఎన్నికల హడావిడి నడిచింది. ఇక జూన్ 4న కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కల్కి ప్రమోషన్లు భారీ స్థాయిలో ఊపందుకోనున్నాయి. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయిన బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు మోత మోగిస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీషులో కూడా డబ్ అవ్వనుంది.
Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter