Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం.. నాలుగేళ్ల వ్యవధిలోనే మరణాలు అందుకేనా?
Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం తగిలిందా? ఆ కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదాలు, లేదా అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో ఎందుకు కన్నుమూస్తున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ వివరాలు
Is There any Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం తగిలిందా? ఆ కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదాలు, లేదా అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో ఎందుకు కన్నుమూస్తున్నారు అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. గత 23 రోజులుగా బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యుల సహా అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే నందమూరి తారకరత్న మాత్రమే కాదు ఆయనకంటే ముందు నందమూరి కుటుంబ సభ్యులు కొంత మంది రోడ్డు ప్రమాదాలలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయాన్ని ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ముందుగా వీరి కుటుంబంలో నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు అయిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూశారు. 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లా కోదాడలో స్వయంగా కారు నడుపుతున్న జానకిరామ్ రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ను టీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు.
ఇక ఆ తర్వాత నందమూరి హరికృష్ణ సరిగ్గా జానకి రామ్ మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత 2018 ఆగస్టు 29వ తేదీన నల్గొండ జిల్లాలోనే జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఒక అభిమాని కుటుంబానికి చెందిన వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఒక వాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఇక ఆయన మరణించిన నాలుగేళ్లకు ఎన్టీఆర్ కుటుంబంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.
2022 ఆగస్టు ఒకటో తేదీన ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనారోగ్య పరిస్థితులు తాళలేక బలం మరణానికి పాల్పడింది. ఇక ఆమె బలవన్మరనానికి పాల్పడి ఏడాది కూడా గడవకముందే ఇప్పుడు తారకరత్న అనూహ్యంగా అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ కన్నుమూయడం గమనార్హం. దీంతో నందమూరి అభిమానులందరూ ఈ కుటుంబానికి ఏమైనా శాపం తగిలిందా? ఎందుకు నాలుగేళ్లకు ఒకసారి ఇలా మరణాలు సంభవిస్తున్నాయి అంటూ చర్చించుకుంటున్నారు.
Also Read: Taraka Ratna Death Reason: తారకరత్న చావుకు అదే కారణం.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook