IT Raids on Mythri Movie Makers మైత్రీ మూవీస్ కార్యాయలం, సుకుమార్ ఇంట్లో గత నాలుగైదు రోజులుగా ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐటీ రైడ్స్‌లో ఏమీ తేలలేదనే టాక్ కూడా వచ్చింది. కానీ తాజాగా జాతీయ మీడియాలో ఈ ఐటీ రైడ్స్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మైత్రీ పెట్టుబడులపై  ఐటీ శాఖ కీలక సమాచారం రాబట్టిన తెలుస్తోంది. ఈ సంస్థలోని ఖాతాల్లోకి దాదాపు ఏడు వందల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఏడు వందల కోట్ల నిధులు తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి   బదిలీ అయినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఆ తరువాత వాటిని ఏడు కంపెనీలకు తరలించినట్లు తెలుస్తోంది. వాటి నుంచి మైత్రీ కి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు ఐటీ అధికారులు సమాచారాన్ని బయటకు తీశారని తెలుస్తోంది. హవాలా ద్వారా బాలీవుడ్  దర్శకుడికి 150 కోట్ల చెల్లింపులు చేశారని సమాచారం.


తాజాగా తీస్తొన్న ఓ  సీక్వెల్ సినిమా హీరోకు సైతం‌ హావాలా రూపంలోనే  పేమెంట్స్ జరిపినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. గత రెండేళ్లలో  ఇద్దరు  బడా హీరోలకు సైతం‌ అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సదరు హీరోల  ఖాతాలను ఐటీ  అధికారులు పరిశీలిస్తున్న ట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ముంబైకి  హీరోలను విచారణకు పిలిచే అవకాశం ఉందనే టాక్ కూడా బయటకు వచ్చింది.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


దీంతో మైత్రీ సంస్థలో సినిమాలు చేసే హీరోలకు కూడా చిక్కులు ఎదురైనట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్ ఇలా బడా హీరోలందరికీ మైత్రీ అడ్వాన్సులు, రెమ్యూనరేషన్లు ఇచ్చి పెట్టేసింది. దీంతో టాలీవుడ్ టాప్ స్టార్ల మీద కూడా ఐటీ రైడ్స్ జరిగే చాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.


Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook