Jabardasth Chalaki Chanti Real Name: జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న చలాకీ చంటి గుండెపోటుకు గురయ్యాడు అనే వార్త టాలీవుడ్ వర్గాలని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. నిజానికి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. అయితే చలాకి చంటి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చాలామందికి చలాకీ చంటి ఒరిజినల్ పేరు కూడా తెలియదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఆయన వివరాలు ఆయన భార్యా పిల్లల వివరాలు కూడా ఎక్కువ మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది జీ తెలుగు న్యూస్ సంస్థ. నిజానికి చలాకీ చంటి ఒరిజినల్ పేరు వినయ్ మోహన్ శర్మ. ఆయన జల్లు అనే సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సినీ రంగ ప్రవేశం చేశారు. నిజానికి ఆ తర్వాత కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు కానీ బ్రేక్ అయితే లభించలేదు. ఈటీవీలో 2013 వ సంవత్సరంలో ప్రారంభమైన జబర్దస్త్ చలాకీ చంటి పేరునే మార్చేసింది. అప్పటివరకు చంటిగా పరిచయమైన ఆయనకు చలాకీ అనే పేరు వచ్చి ఒక్కసారిగా ఫేట్ మొత్తాన్ని మార్చేసింది.


Also Read: Anil Sunkara Tragedy: ఏజెంట్ రిలీజ్ కు ముందు అనిల్ సుంకర ఇంట తీవ్ర విషాదం


ఇక చలాకి చంటి వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. హైదరాబాదులోనే పుట్టి హైదరాబాదులోనే ఆయన పెరిగారు. చలాకీ చంటి బికాం చదివి ఆ తర్వాత ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ కూడా అందుకున్నాడు. వాస్తవానికి చదువుకునే రోజుల్లో బీకాం చేసేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మానేశాడు. ఆ తర్వాత బీకాం పూర్తి చేయడమే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జబర్దస్త్ కార్యక్రమానికి చలాకి చంటి మూడుసార్లు గుడ్ బై చెప్పాడు.


ఇప్పటివరకు మరో కమెడియన్ కి ఇలా ఒకసారి వెళితే మరోసారి లోపలికి రానిచ్చిన దాఖలాలు చాలా తక్కువ. కానీ చలాకీ చంటి విషయంలో మాత్రం ఆయన మూడుసార్లు బయటకు వెళ్లినా మూడుసార్లు లోపలికి రానిచ్చింది మల్లెమాల యాజమాన్యం. తాను ఎన్నిసార్లు బయటకు వెళ్లినా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని అందుకే తనను మూడుసార్లు మళ్లీ లోపలికి తీసుకున్నారని చలాకి  చంటి అప్పట్లో కామెంట్లు చేశారు. ఇక చలాకీ చంటి 2016వ సంవత్సరంలో శ్వేత అనే మహిళను వివాహం చేసుకున్నారు ఆమెకు సువర్చల అనే మరో పేరు కూడా ఉంది.


ఇక ఈ జంటకి ధన్యత అనే కుమార్తె కూడా 2018 సంవత్సరంలో జన్మించింది. ఇక చలాకీ చంటి తల్లి చిన్నతనంలోనే చనిపోగా తండ్రి చలాకీ చంటిని దూరం చేసుకున్నారు.  రేడియో మిర్చిలో ఆర్ర్జేగా కెరియర్ మొదలుపెట్టి తర్వాత ఆయన సినీ రంగం వైపు ఆకర్షితులయ్యారు. ఇక అప్పట్లో చలాకీ చంటి ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభాస్ గురించి ఒక స్కిట్లో తప్పుగా మాట్లాడారు అంటూ ప్రభాస్ అభిమానులు ఆయన మీద మూకుమ్మడిగా సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. తరువాత ప్రభాస్ అభిమానులకు ఆయన సారీ చెప్పడం జరిగింది. 


Also Read: Chalaki Chanti Health: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు.. హుటాహుటిన హాస్పిటల్ కి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook