Jabardasth Rohini Leg Surgery బుల్లితెర తారలు ఇప్పుడు సోషల్ మీడియాను అన్ని రకాలుగా వాడేసుకుంటున్నారు. ఇంట్లో శుభకార్యాలున్నా, హాస్పిటల్‌ బెడ్డు మీదున్నా కూడా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. వాటితో వ్యూస్‌ కొల్లగొట్టి డబ్బుని కూడా సంపాదించేస్తున్నారు. ఆ మధ్య ఇలానే పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చెబుతూ వీడియోలు చేశాడు. నటి శ్రీవాణికి అప్పట్లో గొంతు సమస్యలు రావడంతో దాని మీదా స్పెషల్ వీడియోలను షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా సందర్భం ఏదైనా కూడా యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడం, వాటికి వింత వింత థంబ్ నెయిల్స్ పెట్టి వ్యూస్ రాబట్టుకోవడం, తద్వారా డబ్బులు సంపాదించుకోవడం అలవాటైంది. ఇప్పుడు రోహిణి సైతం ఆ దారిలోనే నడుస్తోంది. తన కాలికి సర్జరీ జరిగిందని, తాను ఇప్పుడు ఎలా ఉన్నానో చెబుతూ.. వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలో రోహిణి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.


 



విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో తనకి సర్జరీ జరిగిందని రోహిణి చెప్పుకొచ్చింది. రాడ్‌ను తొలగించడానికి డాక్టర్లు చాలా శ్రమించారని తెలిపింది. సర్జరీకి దాదాపు పది గంటల సమయం పట్టిందని రోహిణి పేర్కొంది. ఆరు వారాలపాటు కాలును కిద్ద పెట్టకూడదు, దాని మీద బరువు పెట్టకూడదని వైద్యులు సూచించారట. తాను పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి ఐదు నెలలు పడుతుందని రోహిణి చెప్పుకొచ్చింది.


Also Read:  Akhil Agent OTT : Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్


రోహిణికి దాదాపు ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగిందట. అప్పుడు విశాఖపట్నంలో డాక్టర్ శ్రీధర్.. కుడి కాలిలో రాడ్ వేశాడట. కొంతకాలం తరవాత ఆ రాడ్ తీసేయాలని, కానీ కెరీర్‌లో బిజీగా ఉండటంతో ఖాళీ సమయం దొరకక రోహిణికి కాలిలో ఉన్న రాడ్ తీయించుకోవడం కుదర్లేదట. ఇన్నేళ్లకు కాస్త సమయం దొరకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లిందట. అక్కడ మొత్తానికి సర్జరీ చేయించుకుందట. ఇప్పుడు ఆమె పూర్తిగా క్షేమంగానే ఉన్నారట. కాకపోతే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట.


Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook