Jabardasth Sujatha Rakesh : జబర్దస్త్ స్టేజ్ మీద టీఆర్పీల కోసం కొన్ని ట్రాక్స్‌ను కావాలనే పైకి లేపుతుంటారు. ఎడిటింగ్‌ చేసి, ఎలివేషన్ ఇచ్చి, లవ్ సింబల్స్ వేసి మరీ ట్రాకులను వర్కౌట్ చేయిస్తుంటారు. అలా ఇప్పుడు సుజాత రాకేష్ జోడిని కూడా మల్లెమాల టీం బాగానే వాడేస్తోంది. ఇక ఈ ఇద్దరూ కూడా జనాల్లో తమకున్న క్రేజ్, డిమాండ్ చూసి రెచ్చిపోతోన్నారు. కేవలం జబర్దస్త్ స్టేజ్ మీదే కాదు.. ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడే రెచ్చిపోతోన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమది నిజమైన అమరమైన ప్రేమ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. అది స్క్రీన్ మీద టీఆర్పీ కోసమే చేస్తున్నారా? లేదా? నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వరు. ఆ విషయాన్ని నాన్చి నాన్చి ఉంచితేనే తమకు క్రేజ్ వస్తుందని అనుకున్నారేమో గానీ ఇప్పటికీ తమ ప్రేమ సంగతిని మాత్రం బయటకు రానివ్వడం లేదు.


 



కానీ సుజాత మాత్రం ఎప్పుడూ రాకేష్‌ ఇంట్లోనే కనిపిస్తుంది. రాకేష్‌తోనే కనిపిస్తుంటుంది. తాజాగా యాదమ్మ రాజు, స్టెల్లా నిశ్చితార్థంలోనూ ఈ ఇద్దరూ జంటగా కనిపించారు. అయితే అనంతరం వీరు తీసుకున్న ఫోటో షూట్‌ను సుజాత షేర్ చేసింది. అందులో ఆమె పెట్టిన క్యాప్షన్ చూసి అతి ముదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. గుండెకు చప్పుడు ఎలాగో.. నువ్ నాకు అలాగా.. అంటూ నువ్ లేకపోతే చచ్చిపోతాను అని పరోక్షంగా చెప్పేసింది సుజాత.


సుజాత పోస్ట్ చూసిన నెటిజన్లు.. మీది నిజమైన ప్రేమనా? లేదంటే సుధీర్ రష్మీలానేనా?.. జనాలని ఏర్రి పప్పలని చేయటం లేదు కదా!?, ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు?.. కొత్తలో అలానే ఉంటది.. అంటూ ఇలా కౌంటర్లు వేస్తున్నారు. మరి వీటికి వీరిద్దరూ సమాధానాలు ఇస్తారా? అన్నది అనుమానమే.


Also Read : Selfish Movie : వారసుడిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు.. అన్న కొడుకు కోసం దిల్ రాజు కష్టాలు


Also Read : Pawan Kalyan Sujeeth Movie : పవన్ కళ్యాణ్‌ సుజిత్ సినిమా.. మంచు మనోజ్ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్‌లో చీలికలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook