హౌస్ ఫుల్, హౌస్ ఫుల్-2,  మర్డర్-2 చిత్రాల హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఐతే ఈసారి ఫిట్నెస్ మంత్రతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!


బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తోంది. ఆరోగ్యంగా మంచి జీవితం గడపాలంటే అందరూ యోగా చేయాలని ఆమె సూచించింది. దీనికి సంబంధించి. . తాను యోగా చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. హృద్యమైన సంగీతం పెట్టుకుని యోగా చేయడం ద్వారా మంచి స్వాంతన లభిస్తుందని రెండు వీడియోలకు ఆమె క్యాప్షన్‌గా పెట్టింది.



 


Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర


జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పెట్టిన రెండు వీడియోలపై ఆమె అభిమానులు భారీగా స్పందించారు. ఆమె పెట్టిన యోగా పోస్టులకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. ప్రస్తుతం 'మేరే ఆంగనేమే..' పాటలో బిగ్ బాస్ 13 ఫేమ్ అసిమ్ రియాజ్ తో కలిసి నటించింది. ఇప్పుడు ఆ పాట దుమ్మురేపుతోంది.



 'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..