Bigg Boss 4 Telugu host: నాగ్ స్థానంలో హోస్ట్‌గా రాబోయేది ఎవరు ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4ను హోస్ట్ చేస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున వీకెండ్‌లో మరింత ఫన్, ఎంటర్టెయిన్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం మనాలిలో `వైల్డ్ డాగ్` షూటింగ్ జరుగుతోంది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లడంతో ఈ వారం మరో సెలెబ్రిటీ బిగ్ బాస్ 4 తెలుగు షోను హోస్ట్ చేయనున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4ను హోస్ట్ చేస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున ( BB4 Telugu host Nagarjuna ) వీకెండ్‌లో మరింత ఫన్, ఎంటర్టెయిన్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమాలో ( Wild dog movie ) నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం మనాలిలో 'వైల్డ్ డాగ్' షూటింగ్ జరుగుతోంది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి ( Nagarjuna in Manali ) వెళ్లడంతో ఈ వారం మరో సెలెబ్రిటీ బిగ్ బాస్ 4 తెలుగు షోను హోస్ట్ చేయనున్నారు. Also read : Dasara 2020 on Zee Telugu: కల్నల్ సంతోష్ బాబుకి ఘన నివాళి ఈ సూపర్ పర్‌ఫార్మెన్స్
కానీ ఇప్పుడు ఆ హోస్ట్ ఎవరు అనేది టాలీవుడ్‌లో చర్చనియాంశంగా మారింది. గత సంవత్సరం, బిగ్ బాస్ షోకి నాగార్జున అందుబాటులో లేనప్పుడు శివగామి 'రమ్య కృష్ణ' ( Actress Ramyakrishna ) షోను హోస్ట్ చేసి, నటనలోనే కాదు హోస్టింగ్‌లోను తనదైన ముద్ర వేసింది.
అలాగే ఈ సీజన్‌లో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో రోజా ( Actress turned politician Roja ) కాని, లేదా జగపతి బాబు ( Jagapathi Babu ) కాని షో హోస్ట్ చేయబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఐతే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కనుక అసలు వాస్తవం ఏంటనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. బిగ్ బాస్ టీమ్ ఈ సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఊరిస్తున్నారు. Also read : Ramaraju for Bheem teaser: 'రామరాజు ఫర్ భీమ్ ' సీక్రెట్ ఇదేనా ?
ఈ వారం నామినేషన్స్‌లో ( Bigg Boss 4 Telugu nominations ) ఉన్న వాళ్ల నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎలిమినేషన్‌ను ( Bigg Boss 4 Telugu eliminations ) ఎవరు నిర్వహిస్తారో తెలియాలంటే వీకెండ్ వరకు మనం వేచి చూడాల్సిందే.
శనివారం నాడు హోస్ట్ నాగార్జున చెప్పిన డీల్ 'అర గుండు, అర మీసం' టాస్క్ పూర్తి చేసినందుకు అమ్మ రాజశేఖర్ మాస్టర్ ( Amma Rajasekhar ) నామినేషన్ నుండి సేఫ్ అయిన సంగతి తెలిసిందే. మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్ ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ 11 మంది కంటెస్టెంట్స్‌లో నోయల్ ( BB4 Telugu contestant Singer Noel Sean ) డైరెక్ట్ నామినేట్ అవ్వగా.. మిగిలిన 10 మంది కంటెస్టేంట్స్ ని అయిదు జంటలుగా విడదీశారు. ఒక్కో జంటలో ఎవరు నామినేట్ అవ్వాలో వారినే చర్చించుకోమని బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. అందులో అఖిల్, మోనల్ ( Monal gajjar ) ఒక జంట, అభిజిత్, హారిక ( Harika ) ఒక జంట, లాస్య, దివి ( Divi ) ఒక జంట, అరియాన (Ariyana ), మెహబూబ్ ఒక జంట, సోహెల్, అవినాష్ ( Avinash ) మరో జంటగా విడిపోయారు. ఒక్కో జంట వెలాడదీసి ఉన్న రంగు బకెట్ కింద నిల్చోగా, ఎవరైతే నామినేట్ అవుతారో వారిపై రంగు నీళ్ళు పడతాయి. Also read : Amma Rajasekhar: అమ్మరాజశేఖర్ ఎంతపని చేశాడు!
అలా డైరెక్టుగా నామినేట్ అయిన నోయల్‌తో పాటు మోనల్ గజ్జర్, అభిజీత్, అవినాష్, దివి, అరియాన ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. "ఇలా అభిజీత్‌తో ( Ahijeet ) కలిసి ఇద్దరిలో ఎవరు నామినేట్ అవ్వాలో తేల్చుకోమనడం అనేది అన్‌ఫేర్ బిగ్ బాస్" అంటూ హారిక కన్నీళ్ళు పెట్టుకుంది. అలాగే "బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే ఆడేవారే కావాలి కనుక నేనే సేఫ్ సైడ్‌లో ఉంటాను అంటూ అఖిల్ ( Akhil ) వెళ్లి మోనల్‌ని నామినేట్ చేశాడు. ఇలా మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మరి ఈ వారం ఎవరు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటారో చూడాలి మరి. Also read : Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe