Ramaraju for Bheem teaser: 'రామరాజు ఫర్ భీమ్ ' సీక్రెట్ ఇదేనా ?

Ram charan's voice for Jr Ntr in Ramaraju for Bheem: దర్శక ధీరుడు జక్కన్న డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రేపు జూ. ఎన్టీఆర్ వెర్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ టీజర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Oct 22, 2020, 12:14 AM IST
Ramaraju for Bheem teaser: 'రామరాజు ఫర్ భీమ్ ' సీక్రెట్ ఇదేనా ?

Ram charan's voice for Jr Ntr in RRR movie sneak peek: దర్శక ధీరుడు జక్కన్న డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి గురువారం జూ. ఎన్టీఆర్ వెర్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ టీజర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సస్పెన్స్ మరింత పెంచడం కోసం ఈ రోజు చరణ్ ఒక చిన్న వీడియోను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా షేర్ చేశాడు. Also read : Bhumika Chawla divorce rumors: భూమిక విడాకులు.. సమాధానం ఇదిగో..

 

రామ్ చరణ్ "భీమ్ ఫర్ రామరాజు" అనే టీజర్ ( Bheem for Ramaraju teaser ) రామ్ చరణ్ బర్త్ డే ( Ramcharan birthday ) సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో రామ్ చరణ్ యాక్షన్స్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చి ఆ టీజర్‌కి బలం చేకూర్చాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న కొమురం భీమ్ టీజర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండే కానీ, ఏవో కారణాల వల్ల అది సాధ్యపడలేదు. Also read : Happy Birthday Prabhas: రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది..

రేపు కొమురం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ టీజర్‌ని ( Jr Ntr teaser from RRR movie ) విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ యాక్షన్స్‌కి రామ్ చరణ్ వాయిస్ ( Ramcharan voice ) ఉండబోతోంది. ఈ టీజర్‌లో రామ్ చరణ్ ఇవ్వబోయే మెగా పవర్‌ఫుల్ వాయిస్ ఎలా ఉంటుందా అని తారక్ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

రేపు రిలీజ్ కానున్న ఈ టీజర్ కోసం చరణ్ ఐదు భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మిగతా భాషలతో పాటు మలయాళం వర్షన్‌కి కూడా చరణే స్వయంగా వాయిస్ ఇవ్వడం విశేషం. మరి మెగా వాయిస్ ఓవర్‌తో రానున్న ఎన్టీఆర్ టీజర్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో, తారక్ విజువల్స్‌కి చెర్రీ ఏ రేంజ్‌లో వాయిస్ ఇచ్చాడో చూడాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ వెర్షన్ టీజర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. Also read : Radhe Shyam Music director: రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతడేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News