Janhvi Kapoor gown zip rips జాన్వీ కపూర్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో తన బాధను వివరించింది. ఫిల్మ్ ఫేర్ స్టేజ్ మీద పర్ఫామెన్స్ ఇచ్చేందుకు రెడీ అయిందట. పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఇంకో ఐదు నిమిషాలు ఉందనే లోపు ఇలా తన గౌను జిప్ ఊడిపోయిందట. దీంతో జాన్వీ కపూర్‌కు ఇలా ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చిందట. జాన్వీ కపూర్‌ ఇలా కారులోనే ఆ గౌన్ జిప్‌ను కుట్టించుకోవాల్సి వచ్చిందట. డ్రెస్సింగ్ రూంలోనూ ఇలా కుస్తీలు పడిందట. తన కష్టాలను చెబుతూ జాన్వీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వీ కపూర్ స్టేజ్ పర్ఫామెన్స్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తెరపై జాన్వీ కపూర్ ఎంతలా నటించినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సక్సెస్ అవ్వడం లేదు. ఇంత వరకు ఆమె ఖాతాలో సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడలేదు. అయితే ఇలాంటి స్టేజ్ పర్పామెన్స్, సినిమా ఈవెంట్లు, సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో నానా హంగామా చేస్తుంటుంది.


 



జాన్వీ కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోన్నట్టుగా ఉంది. అసలే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతోన్న సినిమా మీద ఆకాశన్నంటే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మామూలుగా అయితే జాన్వీ తెలుగులోకి ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే లేటుగా ఎంట్రీ ఇస్తోన్న అదిరిపోయే ప్రాజెక్ట్‌తోనే ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కోసం జాన్వీ హైద్రాబాద్ వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే.


Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌


ఎన్టీఆర్‌తోనే కాకుండా రామ్ చరణ్‌తోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్‌ బుచ్చిబాబు సానా కాంబోలో రావాల్సిన సినిమాలోనూ జాన్వీనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా తెలుగులోకి వచ్చాకే జాన్వీ కపూర్ కెరీర్ ఊపందుకునేలా ఉంది.


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook