Silk Smitha Death Mystery: సిల్క్ స్మిత గురించి తెలియని వారు ఉండరు. వడ్లపాటి విజయలక్ష్మి అంటే ఎక్కువ మంది గుర్తుపట్టరేమో కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం అందరూ పాత రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన విజయలక్ష్మి సిల్క్ స్మిత గా మారి ఇండస్ట్రీ లోనే చెరిగిపోలేని ముద్రను వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో ఐటెం సాంగ్ అంటేనే గుర్తొచ్చేది సిల్క్ స్మిత పేరు. కేవలం ఆమె ను చూడటం కోసమే థియేటర్లకు వచ్చే జనాలు చాలామంది ఉండేవారు. ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు కానీ బోలెడు అవమానాలు ఎదురయ్యాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిన సిల్క్ స్మిత కొద్ది రోజుల్లోనే స్టార్ స్టేటస్ ను కూడా అందుకుంది. 


తన డాన్స్ తోనే కాక అందంతో కూడా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది సిల్క్ స్మిత. తెలుగులో మాత్రమే కాక తమిళ్, కన్నడ,  మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈమె హవా ఒక రేంజ్ లో ఉండేది. ఒక రకంగా సిల్క్ స్మిత అప్పట్లోనే ప్యాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. 


తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఆమె తుది శ్వాస విడిచారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిల్క్ స్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అని ఎవరికీ తెలియదు. సిల్క్ స్మిత తో పాటు పలు సినిమాల్లో కలిసి నటించిన జయమాలిని తాజాగా సిల్క్ స్మిత గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. 


"చాలా తక్కువ సమయంలోనే సిల్క్ స్మిత పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా సంపాదించింది. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించాం కానీ షూటింగ్ స్పాట్ లో ఆమె నాతో ఎక్కువగా మాట్లాడేది కాదు. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం. ఆమె చేసిన పెద్ద తప్పు ప్రేమించడం. తల్లిదండ్రులను వద్దనుకొని ఒక వ్యక్తిని గుడ్డిగా ప్రేమించి మోసపోయింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు పక్కన ఉండి ఉంటే ఆమె బతికి ఉండేదేమో. నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆమె మోసపోయింది అందుకే ఆమె జీవితం ముగిసిపోయింది" అని అన్నారు జయమాలిని.


Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌


Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?



 


 


 


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook