‘అజ్ఞాతవాసి’ చిత్రనిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫ్రెంచ్‌ దర్శకుడు జెరోమి సలే ట్విట్టర్ వేదికగా తెలిపారు. పవన్‌కల్యాణ్‌ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పై నిర్మితమైన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తొలుత మిశ్రమ స్పందనలు వచ్చినా.. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఈ సినిమా మంచి వసూళ్ళనే రాబడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఫ్రెంచ్‌ చిత్రం ‘లార్గో వించ్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని  చాలామంది తెలపడంతో ఇప్పుడు ఆ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. లార్గో వించ్ చిత్ర దర్శకుడు కూడా ‘అజ్ఞాతవాసి’  చిత్రం చూసి.. ఆ చిత్రం తన సినిమాకి దాదాపు కాపీగానే ఉందని తెలిపారు. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిస్తామని కూడా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ట్విటర్‌లో ఓ నెటిజన్ మాట్లాడుతూ ‘అజ్ఞాతవాసి’ టీమ్ , టీ-సిరీస్‌ పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయని, అలాంటప్పుడు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసుకోవచ్చు కదా అని జెరోమి సెలేని ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రశ్నకు సెలే జవాబిస్తూ ‘లేదు’ అని తెలిపారు.