Jio Phone Next Exchange Offer, Jio Phone Next buy just Rs 4499 in India: 'రిలయన్స్' రిటైల్ సంస్థ ఇండియా టెలికాం రంగంలో ఊహించని మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు దగ్గరైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా 'జియో' మేనియానే నడుస్తోంది. మరోవైపు మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. రోజురోజుకు కొత్తకొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్న జియో.. వియోగ‌దారుల‌ కోసం ఓ సూప‌ర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో నుంచి వచ్చిన చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్స్ట్ ఫోన్‌పై తొలిసారి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సంవత్సరం జియోఫోన్‌ నెక్స్ట్ మొబైల్‌ లాంచ్ కాగా.. తొలిసారిగా జియో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,000 తగ్గింపుతో పొందే అవకాశం వినియోగదారుల ముందు ఉంచింది. రూ.6,499 ధర ఉండే జియోఫోన్ నెక్ట్స్‌ను రూ.4,499కు పొందవచ్చు. అయితే జియోఫోన్ నెక్స్ట్‌ ఫోన్‌పై  రూ.2,000 డిస్కౌంట్ పొందాలనుకునే వారు తమ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. బాగా పని చేస్తున్న 4జీ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఇస్తే రూ.4,499కే జియోఫోన్ నెక్స్ట్‌ను మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంది. 


జియోఫోన్ నెక్ట్స్ కొనాలనుకునే వారు ముందుగా రూ.1,999 చెల్లించి.. 24నెలల వరకు ఈఎంఐల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే దీంటోపాటు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ ఉండే ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 24 నెలల ఈఎంఐను ఎంచుకుంటే నెలకు రూ.300, 18 నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈఎంఐ ఆప్షన్ ద్వారా జియోఫోన్ నెక్స్ట్‌ను తీసుకుంటే అదనంగా రూ.501 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


జియోఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్లు:
# 5.45 ఇంచుల డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్)
# క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ ఆధారిత ప్రగతి ఓఎస్
# 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
# 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 3500 mAh బ్యాటరీ
# 4జీ, బ్లూటూత్, వైఫై, మైక్రో యూఎస్‌బీ పోర్టు



Also Read: Neha Malik Hot Pics: మినీస్‌లో నేహా మాలిక్.. బీచ్‌లో తడిసిన అందాలతో హీటెక్కిస్తోంది!


Also Read: Diabetes Health Tips: షుగర్ అదుపులో ఉండాలంటే.. డయాబెటీస్ పేషేంట్స్ ఈ నీటిని తీసుకుంటే చాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.