Jithender Reddy: ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’.  నవంబర్ 8 న థియేట్రికల్ గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ట్రైలర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ముఖ్యంగా నక్సలైట్స్ పై తిరుగుబాటు చేసిన వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై రాకేష్ వర్రె నటన హైలెట్ గా ఉంది. రియల్ లైఫ్ జీవిత ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ ఈ చిత్రంలో అద్భుతంగా పిక్చరైజ్ చేసారు. ముఖ్యంగా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ తో  మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు.యాక్షన్ డ్రామా గా రాబోతున్న ఈ చిత్రం లో డైలాగ్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. కెమరా వర్క్ కి నేపథ్య సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది.  టెక్నికల్ గా ఈ సినిమా అన్ని విభాగాల్లో హైలైట్ గా నిలవనుంది. రాకేష్ వర్రె  ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రల్లోకి ఇది చాలా డిఫరెంట్ గా నిలవబోతుంది. ఈ చిత్రం కోసం తన ఫిజికల్ ట్రాన్సఫరమేషన్ కూడా మెచ్చుకొనే విధంగా ఉంది.



1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, గ్లిమ్ప్స్,  పాటలు ఆడియన్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter