Jordar Sujatha Jabardasth Rakesh Marriage: జబర్దస్త్ రాకేష్‌ సుజాతల పెళ్లిని పెద్దలు అంగీకరించారట. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారట. ఈ నెల చివర్లోనే ఎంగేజ్మెంట్ ఉంటుందట. దీంతో ఈ శుభవార్తను పంచుకునేందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అసలు విషయాన్ని చెప్పారు. తమ ప్రేమ, పెళ్లి ప్రకటనను కూడా ఇలా యూట్యూబ్ వీడియో చేసి సొమ్ము చేసుకోవాలని మంచి ప్లానే వేశారు. మొత్తానికి ఈ జంట మాత్రం అందరూ అనుకున్నట్టుగానే ఒక్కటి కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ మేరకు వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఈ ఇద్దరూ. ఎట్టకేలకి పెద్దలు అందరూ కలిసి మాకు పెళ్లి చేయబోతున్నారని, ఈ నెల చివరిలో తమ నిశ్చితార్థం ఉంటుందని, ఆ రోజే లగ్న పత్రిక కూడా రాసుకుంటామని చెబుతూ సుజాత మురిసిపోయింది. తమ మీద వచ్చే రకరకాల ప్రశ్నలు ఇకపై ఉండవని అనుకుంటున్నట్టుగా సుజాత చెప్పుకొచ్చింది. 


మంచి భర్త రావాలని, మంచి కుటుంబం రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందని సుజాత ఎమోషనల్ అయింది. తాను ఆశించిన దానికంటే మంచి భర్తని తనకు ఆ దేవుడు ఇచ్చాడని మురిసిపోయింది. కష్టపడి ఇంటికి వచ్చే భర్తకు తోడు ఉండే భార్య రావాలని అనుకుంటారు.. సుజాత ఎంత అల్లరి చేస్తుందో.. అందరికీ తెలిసిందే.. సుజాతకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు.. అన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాయి.. ఇకపై తాము కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాం అంటూ రాకేష్ చెప్పుకొచ్చాడు.


మొత్తానికి ఈ జోడి ఇప్పుడు ఒక్కటి అవుతుండటంతో యూట్యూబ్‌లో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎప్పుడూ ఇలానే నవ్వుతూ హాయిగా ఉండండి అంటూ వారి వారి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇలా తమ పెళ్లి ప్రకటన చెబుతూ.. తమ యూట్యూబ్ చానెల్ ద్వారా ఆదాయాన్ని కూడా పెంచేసుకుంటున్నారు. ఇక నెక్ట్స్ ఎంగేజ్మెంట్ వీడియో వస్తుందట.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook