Jabardasth Rakesh And Sujatha బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా ఫేమస్సో.. అందులోని ట్రాకులు అంతకన్నా ఎక్కువగా ఫేమస్ అయింది. టీఆర్పీల కోసం కొన్ని ట్రాకులను క్రియేట్ చేస్తుంటుంది టీం. అయితే అవి ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసినంత వరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు ఉండవు. కానీ సోషల్ మీడియాలో కూడా ఆ జంటలు హల్చల్ చేస్తూ ఉంటే జనాలకు మాత్రం అనుమానాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ట్రాక్ మాత్రం సుజాత రాకేష్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఇద్దరూ తమ బంధాన్ని బయట పెట్టడం లేదు. వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని అధికారికంగా చెప్పడం లేదు. కానీ ఇద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఒకే చోట ఉంటున్నారు. ఇప్పుడు ఈ జంట దుబాయ్‌లో సందడి చేస్తూ కనిపించింది. ఏదైనా ఈవెంట్ కోసం ఇలా వెళ్లారా? లేదా పర్సనల్ టూరా? అన్నది తెలియడం లేదు.


 



మొత్తానికీ ఈ జంట వ్యవహారం మాత్రం జోర్దార్‌గా ఉందని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. రాకేష్‌ ఒకప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద రోహిణితో ట్రాక్ నడిపించింది. అయితే సుజాత రాకతో రోహిణి సైడ్‌కు వెళ్లాల్సి వచ్చింది. సుజాత, రాకేష్ ట్రాక్‌కు మంచి క్రేజ్ రావడంతో ఇతర షోల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు.


ఇతర షోలు, ఈవెంట్లలోనూ జంటగానే సందడి చేస్తున్నారు. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్టెస్ అనే షోలోనూ జంటగా కనిపిస్తున్నారు. ఈవెంట్లలోనూ అవే ట్రాక్‌ స్కిట్లను కంటిన్యూ చేస్తున్నారు. కానీ నిజ జీవితంలో వీరి బంధాన్ని మాత్రం కన్ఫామ్ చేయడం లేదు. అసలు విషయాన్ని ఎప్పుడు చెబుతారో చూడాలి.


Also Read : prabhas unstoppable episode : అమ్మ ఆహా ప్లానింగ్ ఇదా?.. ప్రభాస్‌ను వాడేస్తున్నారుగా


Also Read : Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి