Jr NTR and Kalyan Ram Headed to Bangalore: హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఐసీయూలో ఉంచిన వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్నకు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆయనకు మేలేనా అనే వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెలేనా అనే వ్యాధి కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా చంద్రబాబు వంటి వారు ఆయనను బెంగళూరు ఆసుపత్రిలో పరామర్శించారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ ఆయన భార్య శ్వేత కలిసి ఇప్పుడు బెంగళూరు బయలుదేరారు. స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో బయలుదేరుతుండగా హైదరాబాద్ ఎయిర్పోర్టులో వీరు ఫోటోగ్రాఫర్లు కంటికి చిక్కడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


జూనియర్ ఎన్టీఆర్ కు తారకరత్న వరుసకు సోదరుడు అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సోదరుడు నందమూరి మోహన్ కృష్ణ కుమారుడే తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన తారకరత్న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ దెబ్బతో ఆయన ఒకే రోజు 9 సినిమాలు గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.


అయితే ఇలా ఒక హీరోకి సంబంధించి ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్ అవడం అనేది ఇప్పటికీ ఒక వరల్డ్ రికార్డ్ గానే చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి నందమూరి కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇలా అవడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నందమూరి తారకరత్న ఎలా అయినా కోలుకుని తిరిగి రావాలని వారంతా ప్రార్థనలు చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి సోమవారం నాడు మరోసారి పరీక్షలు చేసి పూర్తి క్లారిటీ ఇస్తారని ఇప్పటికే పురందేశ్వరి ప్రకటించారు. చూడాలి మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికీ కుదుటపడుతుంది అనేది.


Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!


Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook