Jr NTR asking SS Rajamouli to take Prabhas for RRR Movie Premiere Show: భారత సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేయడానికి మరో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం రాబోతోంది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. సుమారు ఐదు వంద‌ల కోట్ల‌ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించారు. మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది. బాహుబ‌లి వంటి బంపర్ హిట్ త‌ర్వాత జక్కన్న తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం మరోసారి ప్రమోషన్స్ మొదలెట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రత్యేకంగా జక్కన్ననే హీరోలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు. తాజాగా రాజమౌళి చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్ చేసే కామెడీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, ప్రభాస్‌పై ఎన్టీఆర్ కామెడీ చేశాడు.


ఇంటర్వ్యూలో ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళిని ఎన్టీఆర్ ఓ ప్రశ్న వేస్తాడు. జక్కన్నా.. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కోసం ప్రభాస్‌ని పిలుద్దామా? అని తారక్ అంటాడు. ఏంటి ప్రభాస్‌నే.. ఆయన ఒక ప్రీమియర్ కోసం కదిలి రావడం జరిగే పని కాదులే అని రాజమౌళి బదులిస్తాడు. నువ్ కాకపోతే చరణ్ పిలుస్తాడు, లేకపోతే మేమిద్దరం పిలుస్తాం అని తారక్ అనగా.. 'ఇవన్నీ కాదు, అది జరిగే పని కాదు, ప్రభాస్ రాడు వదిలేయ్' అని జక్కన్న అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.  వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ప్రభాస్ అన్నను పిలవండి ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


అంతకుముందు 'ఆర్ఆర్ఆర్ ప్రీమియ‌ర్ ఎక్క‌డ చూడ‌బోతున్నావు' అని తారక్‌ను జ‌క్క‌న్న అడ‌గ్గా.. 'మీరు ఎక్క‌డ చూస్తారో.. మేం కూడా అక్క‌డే చూడ‌బోతున్నాం' అని సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్ సినిమాను నేను భ్ర‌మ‌రాంబ‌లో చూడ‌బోతున్నాను' అని అంటాడు. ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ పొందింది. సినిమా రన్ టైమ్ 3 గంట‌ల 6 నిమిషాల 54 సెకండ్లుగా ఉంది. 1920లో బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో కొమురం భీమ్‌గా తార‌క్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టించారు. 


Also Read: TSRTC Ticket Prices: బస్సు టికెట్ల ధరల్లో మార్పులు.. ఛార్జీలను రౌండప్‌ చేసిన ఆర్టీసీ!!


Also Read: Pegasus Spyware: చిక్కుల్లో చంద్రబాబు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.. పెగాసస్ కొనుగోలు చేశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook