TSRTC Ticket Prices: బస్సు టికెట్ల ధరల్లో మార్పులు.. ఛార్జీలను రౌండప్‌ చేసిన ఆర్టీసీ!!

TSRTC Ticket Prices. తెలంగాణ రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సు టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పల్లె వెలుగు టికెట్ల ధరల్లో టీఎస్​ఆర్టీసీ రౌండప్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 01:47 PM IST
  • బస్సు టికెట్ల ధరల్లో మార్పులు
  • ఛార్జీలను రౌండప్‌ చేసిన ఆర్టీసీ
  • 12 రూపాయలు ఉన్న చోట 10
TSRTC Ticket Prices: బస్సు టికెట్ల ధరల్లో మార్పులు.. ఛార్జీలను రౌండప్‌ చేసిన ఆర్టీసీ!!

TSRTC implemented roundup ticket policy in PalleVelugu buses: తెలంగాణ రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సు టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పల్లె వెలుగు టికెట్ల ధరల్లో టీఎస్​ఆర్టీసీ రౌండప్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతిరోజు చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్‌ చేసినట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్​ఆర్టీసీ తాజా నిర్ణయంతో కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు తగ్గగా.. మరికొన్ని చోట్ల పెరిగాయి. 

పల్లె వెలుగు బస్సు టికెట్ ధర 12 రూపాయలు ఉన్న చోట ఆ ఛార్జీని10కి ఆర్టీసీ తగ్గించింది. ఇక 13, 14 రూపాయలు ఉన్న టికెట్‌ ఛార్జీని 15 రూపాయలకు పెంచారు. మరోవైపు 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది. టోల్‌ ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణీకుల నుంచి వసూలు చేయనున్నారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. 

కరోనా, లాక్‌డౌన్ కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తీవ్రంగా  ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పొలీసు శాఖలో ఎంత చురుగ్గా ఉండేవారో.. ఆర్టీసీలో అంతకుమించి ఉంటున్నారు. నిత్యం ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తూ లాభాల పట్టే దిశగా కృషి చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టీఎస్‌ఆర్టీసీ పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు.  

Also Read: స్టార్స్ హీరోలు మా సినిమాల్లో నటించడానికి ఇష్టపడరు.. మహేష్ బాబు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!

Also Read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News