Jr NTR Fans: మొదలైన ఆర్ఆర్ఆర్ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్! ఎక్కడో తెలుసా?
Jr NTR Fans Book Entire Premiere Show tickets. అమెరికాలోని ఎన్టీఆర్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా థియేటర్ మొత్తాన్నే బుక్ చేశారట. ఫ్లోరిడాలో ఎన్టీఆర్ అభిమానులు సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో సాయంత్రం 6 గంటల షోను బుక్ చేసుకున్నారట.
Jr NTR Fans Books Entire Florida Theatre for RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల కాంబోలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా.. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా నిరంతరంగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది విడుదల అవ్వాల్సిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. చివరికి 2022 మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండగానే.. ఆర్ఆర్ఆర్ మేనియా మొదలైంది.
ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ఒకవైపు మెగా ఫ్యాన్స్, మరోవైపు నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. ఇక మార్చి 25న భారత్‌లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుండగా.. ఒకరోజు ముందే (మార్చి 24) అమెరికాలో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇటీవలే అక్కడ ఓపెన్ అయింది. టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయట. ప్రీమియర్ బుకింగ్‌లు ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్స్ అయిపోయాయని 'సరిగమ సినిమాస్' అనే ట్విట్టర్ ఖాతా పేర్కొంది.
ఇక అమెరికాలోని ఎన్టీఆర్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఏకంగా థియేటర్ మొత్తాన్నే బుక్ చేశారట. ఫ్లోరిడాలో ఎన్టీఆర్ అభిమానులు సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో సాయంత్రం 6 గంటల షోను బుక్ చేసుకున్నారట. ప్రీమియర్ టిక్కెట్‌లు అన్నింటిని బుక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని 'ఇండియన్ బాక్స్ ఆఫీస్' అనే ట్విటర్ తెలిపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్‌లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే.. ఆ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ఓసారి ఊహించుకోండి. చాలా చాలా బాగుంది కదా..!!.
ఆర్ఆర్ఆర్ సినిమా బ్రిటన్‌లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్'లోనూ విడుదల అవుతుండడం ఓ విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా సరన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: TS Budget 2022: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు- హైలైట్స్ ఇవే..
Also Read: Telangana Budget Session: గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన.. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook