Jr NTR Koratala Siva Movie to Release in 9 Languages: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ ఒక రాజకీయ సభ నిమిత్తం వచ్చిన అమిత్ షా ఎన్టీఆర్ ను పిలిపించుకుని మాట్లాడడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సమయం సిద్ధమైంది అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన ఎవరికి వచ్చిన, నచ్చిన కథనాలు వారు వండి వారుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు సన్నిహితుడు అని చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇది సినిమా చూసి నచ్చి పిలిపించుకుని మాట్లాడినట్లు తనకు ఎక్కడా అనిపించలేదని, కచ్చితంగా దీని వెనకేదో రాజకీయం ఉందని అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా క్రౌడ్ పుల్లర్, జనాల్ని ఆకర్షించే విధంగా ప్రసంగించగల వక్త, అని చెప్పుకొచ్చిన కొడాలి నాని ఎన్టీఆర్ ఏ భాష అయినా ఆరు నెలల్లో పూర్తిగా నేర్చుకోగల ఏక సంధాగ్రహి అని చెప్పుకొచ్చారు.


ఇప్పటికే ఆయన 9 భాషల్లో మాట్లాడగలడు అని కూడా కొడాలి నాని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందుకే ఆయనని వాడుకోవడానికి బీజేపీ సిద్ధం అయింది అన్నట్టు ప్రచారం జరిగింది.  ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా దాదాపు తొమ్మిది భాషల్లో విడుదల కాబోతుందనే వార్త హైలైట్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత మిక్కిలినేని సుధాకర్ వెల్లడించినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


నిజానికి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాని కూడా ముందుగా ఐదు భారతీయ భాషల్లోనే విడుదల చేశారు. తర్వాత కొన్ని విదేశీ భాషల్లో డబ్బింగ్ అయింది. అయితే అలాగే ఎన్టీఆర్ సినిమాని డబ్బింగ్ చేస్తారా? లేక తొమ్మిది భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేస్తారా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj Non stop Tweets: అనసూయ ఆంటీ అన్నా తప్పే అక్కా అన్నా తప్పే.. ఈ పంచాయితీ ఆగేది ఎప్పుడు?


Also Read; Brahmastra Pre release Event: పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..కాలర్ ఎగరేస్తున్న ఫాన్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి