Brahmastra Pre release Event: పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..కాలర్ ఎగరేస్తున్న ఫాన్స్..!

Jr NTR as Chief Guest For Brahmastra Pre release: మొన్న అమిత్ షాతో భేటీ, నేడు ఒక పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరు కాబోతూ ఉండడంతో ఆయన ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 02:21 PM IST
Brahmastra Pre release Event: పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..కాలర్ ఎగరేస్తున్న ఫాన్స్..!

Jr NTR as Chief Guest For Brahmastra Pre release: సౌత్ నుంచి బాహుబలి వచ్చిన తర్వాత అలాంటి సినిమా చేయడానికి బాలీవుడ్ అనేక తంటాలు పడుతోంది. ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి పలు ప్రయత్నాలు జరిగినా సరే బాహుబలి రికార్డులను కానీ ఆ విజువల్ వండర్ ను గాని టచ్ చేయలేకపోయారు, మళ్లీ రీ క్రియేట్ చేయలేకపోయారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ పేరుతో సెప్టెంబర్ 9వ తేదీన ఒక సినిమా విడుదల చేస్తున్నారు.

రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, డింపుల్ కపాడియా, షారుక్ ఖాన్, సౌరవ్ గుర్జార్, అమితాబచ్చన్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్ల మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా, మమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మరిజీకే డిసౌజా, అయాన్ ముఖర్జీ నిర్మిస్తున్నారు. అలాగే అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హిందీ మాత్రమే కాక తెలుగు సహా దక్షిణాది భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని దక్షిణాదిలో రాజమౌళి సమర్పిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాను రాజమౌళి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ చరిత్రలోనే భారీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నామని చెబుతూ సెప్టెంబర్ రెండో తేదీ సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో సాయంత్రం 6:00 నుంచి ఈ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించారు.

బ్రహ్మాస్త్రం కోసం ఎన్టీఆర్ ఉరఫ్ భీమ్ వస్తున్నారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఒక బాలీవుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలుగు హీరో ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉండడం అనేది ఆసక్తికరంగా మారింది . మొన్న జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అవుతూ ఉండడంతో ఆయన అభిమానులైతే గాల్లో తేలుతున్నారు. ఇది మా ఎన్టీఆర్ సత్తా అంటూ అభిమానులు పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!

Also Read: Liger Movie 2 Days Collections: రెండో రోజు దారుణంగా కలెక్షన్స్.. కానీ హిందీలో మాత్రం అదుర్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News