అనారోగ్యంతో బాధ పడుతున్న తన వీరాభిమానితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో కాల్‌లో ( Jr Ntr video call to fan ) సంభాషించారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వెంకన్న కండరాల బలహీనతతో ( Muscular dystrophy ) మంచంపట్టాడు. ఇతర అభిమానుల ద్వారా వెంకన్న అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. మంగళవారం అతడికి వీడియో కాల్ చేసి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వెంకన్న పరిస్థితి గురించి ఎన్టీఆర్ స్వయంగా అతడినే అడిగి తెలుసుకున్నాడు. Also read : KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ వెంకన్నతో మాట్లాడుతూ "మీరు నిశ్చింతగా ఉండండి, మీ కోసం నేను చేయగలిగే సాయం చేస్తాను" అని ఎన్టీఆర్ అతనికి హామీ ఇచ్చాడు. అతను త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నాడు. విశ్రాంతి తీసుకోమని.. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం ( Healthy food ) తినమని వెంకన్నకు సూచించాడు. వెంకన్న తల్లి కూడా కొడుకు బాధ గురించి ఎన్టీఆర్‌తో చెప్పింది. "తనను వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదని, ఉన్న భూమి కూడా అమ్ముకొని చాలా ఆసుపత్రులు తిరిగామని, అయినా కూడా వ్యాధి నయం కాలేదని చెప్పింది". వెంకన్న తల్లి మాటలకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. "నేను ఉన్నాను మీ అబ్బాయిని నిశ్చింతగా చూసుకోండి" అని అన్నారు. Also read : Alia Bhatt: తారక్ రిక్వెస్ట్‌ చేశాడనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడా ?



ఎన్టీఆర్‌తో అభిమాని వెంకన్న మాట్లాడుతూ.. ''మిమ్మల్ని కలవాలని ఎప్పటినుండో ఓ కోరిక ఉందని, అలాగే మీతో ఒక సెల్ఫీ కావాలి ( Fan wants selfie with Jr Ntr )'' అని కోరాడు. వెంకన్న కోరికపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. కరోనావైరస్ కొంచం తగ్గాకా తొందర్లోనే కలుద్దాం అని, అలాగే మంచి సెల్ఫీ కూడా తీసుకుందాం అని అభిమాని వెంకన్నకు హామీ ఇచ్చాడు. తారక్‌కి, ఆయన వీరాభిమాని వెంకన్నకు మధ్య జరిగిన ఈ వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, పీఆర్వో వంశీశేఖర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Also read : PSPK27 actress: పవన్ కల్యాణ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?


ఎన్టీఆర్ చెప్పిన మాటలు విన్న వెంకన్న.. '' మిమ్మల్ని కలవడం కోసమైనా బతికుంటాను'' అని బదులిచ్చాడు. వెంకన్న మాటలకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. నీకు ఏం కాదు ఆనందంగా ఉండు ఆ ఆనందమే నీకు ఆయుష్షు పోస్తుంది. నీకు ఏం కాదు.. నాకు ఏం కాదు.. అందరం ఇక్కడే ఉంటాం'' అని అభిమానికి సూచించాడు. ఎన్‌టిఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe