Jr NTR in Nara Rohit Engagement  : గత కొన్ని సంవత్సరాలుగా నారా ఫ్యామిలీ, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మౌనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు ఎన్టీఆర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా సరే ఎన్టీఆర్ ను  అటు నందమూరి ఫ్యామిలీ కానీ ఇటు నారా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా తమ కుటుంబాలలోకి ఆహ్వానించకపోవడం అభిమానులలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది.  అయితే ఆ రెండు కుటుంబాలు ఎన్టీఆర్ ను దూరం పెట్టాయా..?  లేక ఎన్టీఆర్ ఆ రెండు కుటుంబాలను దూరం పెట్టారా? అన్న విషయం తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఒకవైపు నారా , నందమూరి ఫ్యామిలీలు ఒకవైపు అన్నట్టుగానే వాతావరణం కనిపిస్తోంది.


ఇదిలా ఉండగా నారావారి అబ్బాయి నారా రోహిత్ నిశ్చితార్థం హైదరాబాదులో అత్యంత సన్నిహితులు,  కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.  అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ ను  వీరు ఈవెంట్ కి ఆహ్వానించలేదా ? ఒకవేళ ఆహ్వానించినా ఆయన ఈవెంట్ కి రాలేదా?  అన్నది తెలియాల్సి ఉంది. 


మరోవైపు నారా రోహిత్ హీరోగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాలలో చురుకుగా లేనప్పటికీ ఎప్పుడు కూడా తన పెదనాన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ ఉంటాడు.  ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ను  ఆహ్వానించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకల్లో కనిపించకపోయేసరికి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. 


ఇక నారా రోహిత్ విషయానికి వస్తే.. ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లెల్ల తో పరిచయం ఏర్పడి , ఆమెతోనే నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు ఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు.  డిసెంబర్ 15వ తేదీన వీరి పెళ్లి జరగబోతోందని  సమాచారం.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter