Jr NTR Off To Oscar 2023 యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అమెరికాకు బయల్దేరాడు. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ పయణం అయ్యాడు. అయితే ఎన్టీఆర్‌కు ఇప్పుడు హెచ్‌సీఏ అవార్డు ఇచ్చేలా ఉంది. ఇన్ని రోజులు అక్కడ రామ్ చరణ్‌ సందడి చేయగా.. ఇప్పుడు ఇద్దరూ కలిసి అక్కడ హల్చల్ చేయబోతోన్నారు. తన హీరోలతో జక్కన్న ఇంకా అక్కడే ఆస్కార్ వరకు ఉండి.. ఆ అవార్డును ఇండియాకు తీసుకొచ్చేలా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ అయితే ఇలా ఎయిర్ పోర్టులో సందడి చేశాడు. క్యాజువల్ లుక్‌లో ఎంతో స్టైలీష్‌గా కనిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా అయితే కొరటాల శివతో చేయబోయే సినిమా షూటింగ్ జరుగుతూ ఉండాల్సింది. ఈ షూటింగ్ ఉంటుందనే హెచ్‌సీఏ అవార్డులకు రాలేకపోయాడట. అయితే తారకరత్న మరణం, పెద్ద కర్మ వంటి కార్యక్రమాలు ఉండటంతో అమెరికాకు వెళ్లలేకపోయాడు. ఇప్పుడు అన్ని పనులు పూర్తయ్యాయి. కొరటాల శివ సినిమా షూటింగ్ ఆస్కార్ వేడుకల అనంతరం ప్రారంభించనున్నారు.


 



ఇప్పుడు అంతా కూడా ఆస్కార్ అవార్డుల మీద ఫోకస్ పెట్టారు. ఈ సారి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని, ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుందని, నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డు వస్తుందని అంతా భావిస్తున్నారు. రాజమౌళి ప్రమోషన్స్, పబ్లిసిటీ అంతా కలిసి వస్తుందని, ఈ సారి ఆస్కార్ అవార్డ్ మిస్ అవ్వదని అంతా ధృడంగా నమ్ముతున్నారు.


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా, ఏబీసీ మీడియా ఇంటర్వ్యూ, హెచ్‌సీఏ అవార్డు వేడుకల్లో రామ్ చరణ్‌ చేసిన సందడి, సోషల్ మీడియా వచ్చిన కవరేజ్, పెరిగిన క్రేజ్‌తో నందమూరి ఫ్యాన్స్‌కు కాలిపోయినట్టుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అడుగు పెట్టడంతో అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటుందో చూడాలి.


ఆస్కార్ ఈవెంట్ దగ్గర పడుతుండటంతో మరోసారి ఆర్ఆర్ఆర్ సత్తా చాటేందుకు ఈ సినిమాను అక్కడా, ఇక్కడా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి తన బ్రెయిన్‌ను బాగా వాడి ఆస్కార్‌ను ఇండియాకు తీసుకొచ్చేలానే ఉన్నాడు.


Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్


Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook