RRR Review: `ఆర్ఆర్ఆర్` బాక్సాఫీస్ బొనాంజా.. చరిత్రలో నిలిచిపోతుంది! 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యుడు!!
RRR Movie Review. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ ఇచ్చారు. బాక్సాఫీస్ బొనాంజా ఖాయం అని పేర్కొన్నారు.
Umair Sandhu On RRR Movie First Review : దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఎన్నో వాయిదాల తరువాత ఈ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. మెగా హీరో, నందమూరి హీరో నటించడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటే.. బాహుబలి తర్వాత జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం దేశ సినీ ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంపై అంచనాలు ఓ రేంజికి చేరాయి. ఈ నేపథ్యంలో సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ రివ్యూ ఇచ్చారు. బాక్సాఫీస్ బొనాంజా ఖాయం అని పేర్కొన్నారు. 'ఓ భారతీయ ఫిలింమేకర్ సత్తాకు నిదర్శనమే ఆర్ఆర్ఆర్. పెద్ద కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో అందరూ గర్వపడేలా ఈ సినిమా తీశారు. ఈ సినిమాను అసలు మిస్ చెయ్యొద్దు. ఈరోజు ఆర్ఆర్ఆర్ బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ అనుకోవచ్చేమో గానీ.. రేపు మాత్రం ఓ క్లాసిక్ సినిమాలా చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్టీర్, రామ్ చరణ్ ఇరగదీశారు' అని ఉమైర్ సంధూ ట్వీట్ చేశారు.
కథ & స్క్రీన్‌ప్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు నిజమైన హీరో.. అది మిమ్మల్ని 3 గంటల పాటు సీట్లో నుంచి లేవకుండా చేస్తుందని ఉమైర్ సంధూ పేర్కొన్నారు. ప్రతి నటుడు అత్యున్నత ప్రతిభ కనబర్చారని, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు గుండెకాయ లాంటివాడన్నారు. రామ్ చరణ్ సమ్మోహితులను చేశాడని, ఎన్టీఆర్-చరణ్ ది డెడ్లి కాంబో అని చెప్పారు. అజయ్ దేవగణ్ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజి అని, అలియా భట్ తన పాత్రకు న్యాయం చేసిందన్నారు. రాజమౌళి ఈ సినిమాతో అధికారికంగా భారత్‌లో నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకుంటారని ఉమైర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు అతడు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ ఇప్పటికే రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఇప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమా చూశా. కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూశాను. సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యా. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. భారతీయ బాక్సాఫీస్‌లో కొత్త రికార్డ్స్ వస్తాయి. ఆర్ఆర్ఆర్ 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది' అని శివకుమార్ ట్వీట్ చేశారు.
Also Read: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్! ఇక పండగే పో!!
Also Read: Nayanatara-Vignesh Shivan: స్టార్ హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook