Jr Ntr with Atlee: తమిళ దర్శకుడితో తారక్ మూవీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాల దర్శకులను ఎంచుకుంటున్న తీరుచూస్తోంటే.. తారక్ కొత్తగా ఏదో ట్రై చేయాలని భావిస్తున్నట్టు అనిపిస్తోంది అంటున్నారు అభిమానులు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని తారక్ కొత్తగా ఏం అనుకోవడం లేదు. గతంలోనూ తారక్ ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాల దర్శకులను ఎంచుకుంటున్న తీరుచూస్తోంటే.. తారక్ కొత్తగా ఏదో ట్రై చేయాలని భావిస్తున్నట్టు అనిపిస్తోంది అంటున్నారు అభిమానులు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని తారక్ కొత్తగా ఏం అనుకోవడం లేదు. గతంలోనూ తారక్ ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తాజాగా తారక్ దర్శకులను ఎంచుకుంటున్న తీరు చూస్తుంటేనే అలా అనిపిస్తోంది అనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న తారక్.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు '' అయినను హస్తినకు పోయి రావాలే '' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అయినను హస్తినకు పోయి రావాలే చిత్రం తర్వాత కేజీఎఫ్ ఫేం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేసేందుకు తారక్ ఆసక్తి చూపిస్తున్నాడు. స్వాతంత్య్ర ఉద్యమం అనంతరం భారత్- పాకిస్థాన్ విడిపోయిన తీరు నుంచి మొదలుకుని భారత్, పాక్ మధ్య యుద్ధం వరకు చోటుచేసుకున్న ఘటనలు, ఇతర పరిణామాల నేపథ్యంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం.
Also read : Nikhil Siddharth: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన నిఖిల్ సిద్ధార్థ్
ప్రశాంత్ నీల్‌తో ( Prashant Neel ) చిత్రం తర్వాత ప్రముఖ తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి కనబరుస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన అట్లీ డైరెక్ట్ ( Director Atlee ) చేయనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించనున్నాడు.
ఇదే కాకుండా నాగ్ అశ్విన్‌తోనూ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ( Jr Ntr ) ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతకంటే ముందుగా ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తి చేసిన తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్టుపై దృష్టిసారించనున్నట్టు టాలీవుడ్ టాక్. అటు నాగ్ అశ్విన్ కూడా ఆలోగా ప్రభాస్‌తో సినిమాను పూర్తి చేసుకోనున్నాడు.
Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి