తన భర్త, దర్శకుడు రోహిత్ మిట్టల్ చాలా మంచివాడని చెబుతోంది నటి శ్వేతాబసు ప్రసాద్. 'కొత్త బంగారు లోకం'లో ఎకాడా అంటూ చిలిపి మాటలతో మంచిమార్కులే కొట్టేసిన శ్వేతాబసు తర్వాత బొద్దుగా మారి అవకాశాలు కోల్పోయింది. ఇటీవల తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన హీరోయిన్.. తాజాగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కేవలం ఏడాదిపాటు తమ కాపురం సజావుగానే సాగిందని, అయితే ప్రతి ఒక్కరి జీవితం తెరిచిన పుస్తకంగా ఉండదని వేదాంతం వల్లిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు


‘రోహిత్ మిట్టల్ చాలా మంచివాడు. నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇద్దరం పరస్పరం చర్చించుకుని విడాకులకు మొగ్గుచూపాం. అతడు మంచి ఫిల్మ్ మేకర్. ఆయనకు నేను అభిమానినిని. నాకు చాలా మద్దతిచ్చేవాడు. సినిమాలు చేసేందుకు స్వేచ్ఛ ఇచ్చాడు. అయిదేళ్ల పరిచయం చివరికి స్నేహంగా మారాల్సి వచ్చింది. ప్రతి పుస్తకాన్ని కవర్ పేజీ నుంచి చివరిపేజీ వరకు చదవలేము. అలా అని ఆ పుస్తకం బాలేదని కాదు. ఇతరులు చదవకూడనిది అని అర్థం. కానీ ఇక్కడితో దాంపత్య జీవితాన్ని ముగిస్తున్నాం. మరిచిపోలేని అనుభవాలు చాలా ఉన్నాయని’ శ్వేతాబసు ప్రసాద్ గతంలో ట్వీట్ చేశారు. తాజాగా తన విడాకులపై స్పందించిన ఆమె ఇవే విషయాలపై స్పష్టత ఇచ్చింది.



రోహిత్ మిట్టల్ 2017లో గోవా టూర్‌కు వెళ్లినప్పుడు శ్వేతాబసుకు తన ప్రేమ విషయాన్ని ప్రపోజ్ చేశాడు. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 2018లో వివాహ బంధంతో ఒక్కటైంది. గతేడాది డిసెంబర్‌లో రోహిత్, తాను విడాకులు తీసుకోనున్నట్లు నటి శ్వేతాబసు ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్‌పైనే అని, ఇప్పట్లో ప్రేమలో పడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..