HBD Suriya: భర్తను సర్ప్రైజ్ చేసిన జ్యోతిక.. ఊహించలేదుగా..?
Suriya-Jyothika: ఈరోజు తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది జ్యోతిక. ప్రస్తుతం తన భర్త కుటుంబ బాధ్యతలు , సినిమాలు అంటూ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో కొద్ది రోజులు మనశ్శాంతిగా ఫ్యామిలీతో గడపడానికి వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి..మరి భర్తకు బహుమతిగా అందించిందట ఈ ముద్దుగుమ్మ.
Suriya: కోలీవుడ్ హీరో సూర్య ఒక తమిళ్లోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈ హీరో సినిమాలకి కూడా మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి స్థానం అందుకున్న సూర్య, కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కూడా నటించి అదరగొట్టేశారు. ముఖ్యంగా సూర్య హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే సూర్య ఈటి సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కంగువ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు సూర్య. ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో తలమునకలవుతుంటే మరొకవైపు తన భార్య జ్యోతిక నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ ను పర్యవేక్షిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.
అంతేకాదు ఇటీవల కంగువా సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , టీజర్ అని కూడా సినిమాలపై ఆసక్తిని పెంచేసాయి. ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సూర్య ఈరోజు తన 49వ పుట్టినరోజును.. జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య ప్రముఖ హీరోయిన్ జ్యోతిక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చినట్లు సమాచారం.
సూర్య ఎవరో కాదు తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్దకొడుకు.. ఈయన 2006లో సహనటి జ్యోతికను వివాహం చేసుకున్నారు. ఇక 2008లో అగరం ఫౌండేషన్ ప్రారంభించి దాతృత్వ కార్యకలాపాలకు నిధులు సమకారుస్తూ.. సహకారాలు అందిస్తున్నారు.
ఇకపోతే సూర్య జ్యోతిక తమ వైవాహిక బంధం లో ఎంత అన్యాయంగా ఉంటారో అందరికీ తెలిసిందే.ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమను.. ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించి మరీ వివాహం… చేసుకుంది ఈ జంట. అంతేకాదు సూర్య లేనిదే జ్యోతిక లేదు. జ్యోతిక లేనిది సూర్యా లేదు అన్నంతగా నిరూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ముంబైలో పిల్లలతో.. కలిసి జీవిస్తున్నారు సూర్య జ్యోతిక.
ఇదిలా ఉండగా ఈరోజు తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది జ్యోతిక. ప్రస్తుతం తన భర్త కుటుంబ బాధ్యతలు , సినిమాలు అంటూ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో కొద్ది రోజులు మనశ్శాంతిగా ఫ్యామిలీతో గడపడానికి వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఫ్లైట్ టికెట్స్.. బుక్ చేయించి మరి భర్తకు బహుమతిగా అందించిందట ఈ ముద్దుగుమ్మ. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter