Ala Ninnu Cheri First Look ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పోయింది. కంటెంట్ కొత్తగా ఉంటే, మేకింగ్ బాగుంటే ఏ సినిమానైనా సరే జనాలు ఆదరిస్తున్నారు. చిన్న హీరోలను స్టార్ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం కొంత కంటెంట్‌కు ఎక్కువడగా డిమాండ్ ఉంది.  ఇలాంటి తరుణంలోనే  ‘అలా నిన్ను చేరి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో వస్తోండగా.. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. ఇంకో వైపు ప్రమోషన్స్ కూడా చేస్తోంది చిత్రయూనిట్. సంక్రాంతి స్పెషల్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్ చేయించింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన తరువాత చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు దర్శకేంద్రుడు.


 



ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ ఎమోషనల్ సీన్స్ హైలెట్ అయ్యేట్టు కనినిస్తోంది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నాడు. హీరోయిన్లైన హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలతో హీరో చేస్తోన్న రొమాన్స్ యూత్ ఆడియెన్స్‌ను కట్టి పడేసేలా ఉంది. సుభాష్ ఆనంద్ ఆర్ఆర్ హైలెట్‌ కానున్నట్టుగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ స్పెషల్‌గా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయగా మంచి ఆదరణ దక్కింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి