Kajal Aggarwal: కథానాయిక లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.  గతేడాది 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తాజాగా ఈమె కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో నటించిన సినిమా కాజల్ కార్తీక.  దీకే రైటర్‌గా పదార్తి పద్మజ నిర్మించింది. ఇది హార్రర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌గా తెరకెక్కుతోంది.  విగ్నేష్ వాసు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఉగాది కానుకగా  ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.  కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా నచ్చడం గ్యారంటీ అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 5 వేర్వేరు కథలతో అంత్రాపాలజీతో ఈ సినిమాను తెరకెక్కించారు.  కాజల్ కి రెజీనాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీ ఉంటునే హర్రర్ ఇంపాక్ట్ ని ఎలా క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఒక మంచి కామెడీ హర్రర్ ఫిలిం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' కచ్చితంగా నచ్చతుంది. కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.


పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ .  


Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook